Telangana Sarkar: భూ భారతి చట్టాన్ని సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

Telangana Sarkar: భూ సమస్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 పేరుతో బుధవారం శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి భూ భారతి చట్టాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 18, 2024, 03:47 PM IST
Telangana Sarkar: భూ భారతి చట్టాన్ని సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

Telangana Sarkar: ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్‌-2020ను రద్దు చేసి ఆ స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారు. పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్‌ పేరును కూడా భూభారతిగా మార్చారు.  

రాష్ట్రంలో భూ సమస్యలపై అధ్యయనానికి ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 9న ఐదుగురు సభ్యులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్‌ రేమండ్‌ పీటర్, న్యాయనిపుణుడు భూమి సునీల్‌కుమార్, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.మధుసూదన్‌లతోపాటు సీసీఎల్‌ఏలతో ఏర్పాటు చేసిన కమిటీ పలు దఫాలు చర్చలు నిర్వహించింది.

రైతులు, నిపుణులు, రెవెన్యూ సంఘాలు, వక్ఫ్, దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సమావేశమైంది. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించి సమస్యలను అధ్యయనం చేసింది. అనంతరం ప్రభుత్వానికి పలు సూచనలతో నివేదిక సమర్పించింది. కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో పైలట్‌ సర్వేను చేపట్టి కీలక సమస్యలను గుర్తించింది. అనంతరం రాష్ట్రానికి అవసరమైన ఆర్వోఆర్‌ చట్ట రూపకల్పన బాధ్యతను నిపుణులకు అప్పగించింది.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News