అమరావతి: రాష్ట్రంలో మరోసారి అధికార, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాగా, గత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో దాదాపు రూ. 9 కోట్ల వ్యయంతో ప్రజా వేదికను క్యాంప్ కార్యాలయంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక మరోసారి వార్తల్లోకి వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోని గోవిందపల్లిలో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికను కూల్చి, వేలం పాట వేయడంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర పరువును బజారుకీడ్చారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పేదలు రూ.5తో ఆకలి తీర్చుకుంటుంటే మీకెందుకు కడుపు మండిందంటూ, అన్న క్యాంటీన్లను ఎందుకు తీసేసారని, ఎన్నికల ముందు చేతికి అందిన వాళ్ళందరికీ ముద్దులు పెట్టి, అధికారంలోకి వచ్చాక ఆ పేదల నోటికాడ ముద్దను లాక్కుంటారా అని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం, ప్రజా వేదిక అంశంపై మరో అడుగు ముందుకేసింది. ఆసక్తి ఉన్న బిడ్డర్లు మార్చి నెల మూడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించిందని, వెంటనే వేలం నిర్వహిస్తామని ప్రకటించింది.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..