Ram gopal varma controversy post on Telangana police: కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తలలో నిలిచారు. ఆయన ఇటీవల పుష్ప2 మూవీ రిలీజ్ అయిన నేపథ్యంలో అల్లు అర్జున్ కు అండగా నిలిచినట్లు తెలుస్తొంది. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీని పుష్ప2 మూవీతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి నటుడికి.. తెలంగాణ సర్కారు అరెస్ట్ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని సెటైర్ లు వేశారు.
అంతే కాకుండా.. ఆయన సినిమా రీలీజ్ నేపథ్యంలో అనుకోకుండా జరిగిన ఘటన అని ఆయన అన్నారు. అయితే.. గతంలో తాను డైరెక్ట్ చేసిన క్షణం క్షణం మూవీ రీలీజ్ నేపథ్యంలో..శ్రీదేవీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారని, అప్పుడు తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయిన విషయంను గుర్తు చేశారు. ఇప్పుడు స్వర్గంలో ఉన్న శ్రీదేవీని అరెస్ట్ చేస్తారా.. అంటూ తెలంగాణ పోలీసులపై సెటైర్ లు వేశారు.
ఈ క్రమంలో వర్మా పెట్టిన పోస్ట్ ను బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా చేస్తున్నారు. మరొవైపు ఇటీవల రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు మూడు కేసుల్లో స్టే ఇచ్చినట్లు తెలుస్తొంది.
Read more: Samantha: కష్టాలకు కేరాఫ్‌గా మారిన సమంత..!.. లీగల్ నోటీసులు పంపిన స్టార్ హీరో..?. . కారణం ఏంటంటే..?
అంతేకాకుండా.. ప్రస్తుతం వర్మ పెట్టిన పోస్ట్ లపై తెలంగాణ పోలీసులు కూడా కాస్తంత సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది. పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ కు సపోర్ట్ గా.. తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టిన వారిపై రేవంత్ సర్కారు కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ పోలీసులపై వేసిన సెటైర్ లు వార్తలలో నిలిచాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter