Kukatpally MLA: తెలంగాణలో మళ్లీ ఆంధ్ర, తెలంగాణ అనే వివాదం రాజుకుంటోంది. అల్లు అర్జున్ వ్యవహారంలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మాట్లాడుతుండగా.. వాటికి తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొట్టిపారేశారు. ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. శాసనసభ శిక్షణా తరగతుల్లో ఇదేనా నేర్చుకున్నదని ప్రశ్నించారు. ఆయనే కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
Also Read: Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో మాంసం.. అన్యమతస్తుల ప్రచారం
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదం, కేసు నమోదు, అరెస్ట్, ప్రెస్‌మీట్ వంటి వ్యవహారాల సమయంలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పందించారు. అల్లు అర్జున్ ఆంధ్రోడు అని.. అతడి సినిమాలు తెలంగాణలో అడ్డుకుంటామని ప్రకటించడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. 'ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారు. ఇటీవల వీరందరికి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. అందులో ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు నేర్చుకున్నది ఇదేనా ?' ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు.
Also Read: KCR Wishes: క్రీస్తు శాంతి మార్గం అద్భుతం.. ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
'సినీ పరిశ్రమను నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తమిళనాడు నుంచి హైదారాబాద్ నగరానికి తీసుకొచ్చారు. దీని వల్ల సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతత కోరుకొంటున్నారని చెప్పారు. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, అలా మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కృష్ణారావు హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు వారి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో పదేళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ ఆంధ్ర, తెలంగాణ వివాదం రాజుకుంటోంది. అల్లు అర్జున్‌పై కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో ఆంధ్ర ప్రజలు విమర్శలు చేస్తున్నారు. వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మండిపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. భవిష్యత్‌లో ఈ వివాదం మళ్లీ రాజుకునే అవకాశం లేకపోలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.