బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత వారం రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు సోమవారం మార్కెట్లో బ్రేకులు పడ్డాయి. మరోవైపు వెండి సైతం బంగారం ధరల బాటలోనే పయనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి కొనుగోలుకు డిమాండ్ పెరిగినా.. దేశీయ బులియన్ మార్కెట్లో మాత్రం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.
2నిమిషాల్లో పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానం.. లేకపోతే కార్డ్ డెడ్!
మార్చి 9న హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.45,890కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.240 క్షీణించి రూ.42,070 అయింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 44,150 ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,950కి తగ్గింది.
See Pics: మొన్న పింక్ బికినీలో.. నేడు బ్లాక్ బికినీ..
వెండిధర సైతం బంగారాన్ని అనుసరించింది. 1000 గ్రాములు (1 కేజీ) వెండి ధర రూ.1,130 రూపాయలు తగ్గడంతో రూ.50 వేల మార్కుకు కిందకు దిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 49,950కు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1702 డాలర్లకు చేరింది. ఔన్స్ వెండి ధర 0.63 శాతం పెరిగింది. దీంతో ఔన్స్ వెండి ధర 17.37 డాలర్లు అయింది. కాగా, గత రెండు నెలలుగా కరోనా వైరస్ బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది.
Also Read: ఆ కార్డులు మార్చి 16 తర్వాత పనిచేయవు!