న్యూఢిల్లీ: కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు నడిచే వెళ్ళాల్సి వస్తోంది. స్త్రీలు, పురుషులు చిన్న పిల్లలతో కలిసి ఎర్రటి ఎండలో...ఆకలితో, దాహంతో నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి. అలా వలస కూలీలు నడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటువంటి ఓ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజనులను కంటతడి పెట్టిస్తోంది.
Also Read: ప్రధాని సహాయనిధికి 20 కోట్లు విరాళం..!!
ఉత్తరప్రదేశ్ లోని దేవరియాకు చెందిన ఓ తల్లి కొడుకులు బస్తీ జిల్లాలో కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల అక్కడ పనులు లేక ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారము లేక ఆ తల్లి 12 ఏళ్ళ కొడుకును తీసుకొని నడుచుకుంటూ బయలు దేరింది. దాదాపు 80 కిలోమీటర్లు నడిచాక ʹʹ అమ్మా నేను అలిసిపోయాను ఇకనడవలేనుʹ అంటూ నడి రోడ్డుపై అమ్మ పాదాలపై కూలబడ్డాడు బాలుడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ జర్నలిస్టు ఆ ఫోటో తీసి స్థానిక పత్రికలో అచ్చు వేశారు. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఆ చిన్నారి కష్టాన్ని చూసి నెటిజనులు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు కనీస అవసరాలను కల్పించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Also Read: లాక్ డౌన్ విధించినందుకు క్షమించండి..!!