ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. కరోనా లక్షణాలు ఉన్నాయని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
ఉత్తరప్రదేశ్ లోని షామ్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. యూపీలో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ వైద్య అధికారులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పటిష్ట చర్యలు తీుసుకుంటున్నారు. యూపీలో కరోనా రోగుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వారికి చికిత్స అందిస్తున్నారు. ఐతే ఇవాళ (గురువారం) జరిగిన ఓ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి చనిపోవడం మాత్రమే చూశాం. ఇప్పుడు కరోనా దెబ్బకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో బలవన్మరణం చెందాడు.
పోలీసుల అత్యుత్సాహంపై కేటీఆర్ సీరియస్
షామ్లీ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. అతని పేరు, వివరాలు వెల్లడించేందుకు వైద్య అధికారులు, జిల్లా యంత్రాంగం నిరాకరించారు. కానీ అతనికి కరోనా వైరస్ లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఆయన రిపోర్టు ఇవాళ రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జస్జిత్ కౌర్ తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..