COVID-19 updates: ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి, 15 పాజిటివ్ కేసులు నమోదు

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రతలో కొంత మార్పు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా గురువారం 15 పాజిటివ్‌ కేసులు రావడం కొంత ఉపశమనాన్నిస్తోంది. మొదట్లో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతుండటాన్ని పరిశీలిస్తే.. పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నట్టే అనిపిస్తోంది అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Last Updated : Apr 10, 2020, 12:58 AM IST
COVID-19 updates: ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి, 15 పాజిటివ్ కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రతలో కొంత మార్పు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా గురువారం 15 పాజిటివ్‌ కేసులు రావడం కొంత ఉపశమనాన్నిస్తోంది. మొదట్లో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతుండటాన్ని పరిశీలిస్తే.. పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నట్టే అనిపిస్తోంది అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం నేడు నమోదైన 15 కోవిడ్ పాజిటివ్ కేసులు కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కు చేరింది. గురువారం ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 

Also read : Containment zones: హైదరాబాద్‌లో ఆ 12 ఏరియాల్లోకి నో ఎంట్రీ, నో ఎగ్జిట్

జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య వివరాలు

 

 

 

 

 

 

 

 

ఏపీలో ఇప్పటివరకు 10 మంది కరోనావైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గురువారం అనంతపురం జిల్లా మనురేవుకి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు, గుంటూరులోని ఎన్ఆర్ పేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News