న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ టోర్నమెంట్స్ వాయిదా పడటంతో అన్ని దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్స్ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో లాక్ డౌన్ విధించడంతో ఐపిఎల్ 2020 లాంటి ఎన్నో పోటీలు, టోర్నమెంట్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడిన టోర్నమెంట్స్ చివరకు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలిసే పరిస్థితి లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న విషయం తాజాగా ఐసిసి నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చింది. అయితే, ఇదే ఐసిసి సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జే షా.. ఈ విషయంలో ఐసిసికి ఓ ప్రతిపాదన చేశారు.
Also read : KL Rahul fitness: కె.ఎల్. రాహుల్ ఫిట్నెస్ మంత్ర వీడియో చూస్తే మోటివేట్ అవ్వాల్సిందే
కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు తిరిగి పుంజుకునేలా కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం తగ్గిన తర్వాత ఆయా దేశాలతో క్రికెట్ మ్యాచ్లు ఆడటానికి తాము సిద్ధమేనని బీసీసీఐ తరపున బోర్డు సెక్రటరీ జే షా ఐసిసికి ప్రతిపాదించారు. ముఖ్యంగా చిన్న జట్లతోనూ ద్వైపాక్షిక సిరీస్లు ఆడటానికి భారత్ సిద్ధంగా ఉందనే విషయాన్ని జే షా ఐసిసి ముందుంచారు. ఐసిసిలో సభ్యత్వం కలిగిన దేశాల్లో బీసీసీఐనే ధనిక క్రికెట్ బోర్డు కావడంతో ఐసిసి సమావేశంలో బిసిసిఐ చేసిన ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత చేకూరింది. ఇదే ఏడాది చివర్లో 2023-2035 కాలానికి సంబంధించిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్స్ (FTP) కూడా ఖరారు కానుంది.
Also read : Telangana COVID-19 updates: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఇదిలావుంటే, బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం రానున్న ఏడాది కాలంలో భారత జట్టు నాలుగు దేశాల్లో పర్యటించాల్సి ఉంది. అందులో శ్రీలంకలో 6 లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్లు, ఆస్ట్రేలియాలో నాలుగు టెస్ట్ మ్యాచ్లు, జింబాబ్వేలో మ్యాచ్ల వన్డే సిరీస్, సౌతాఫ్రికాలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమే ఆ మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ భావిస్తున్నట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
Also read : సచిన్... ది గ్రేట్ బౌలర్.. హీరోగా నిలిపిన ప్రదర్శనలివే
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది జరగాల్సి ఉన్న T20 వరల్డ్ కప్ విషయంలో ఐసిసి వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నప్పటికీ.. బిసిసిఐ మాత్రం టీ20 వరల్డ్ కప్ జరిగే అవకాశాలు తక్కువే ఉన్నాయని భావిస్తున్నట్టు బిసిసిఐ అధికారి పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..