చిత్తూరు: ఇది ఒక వలసకూలీ దీనగాధ. చిత్తూరు జిల్లా మిట్టపల్లికి చెందిన 28 ఏళ్ల హరిప్రసాద్ బెంగళూరులో నిర్మాణరంగంలో కూలీ పనిచేసుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో సొంతూరుకి బయల్దేరాడు. బెంగుళూరు నుంచి కాలినడకనే 150 కిమీ మేర ప్రయాణించాడు. సొంతూరికి దగ్గర్లోకి వచ్చాకా అలసిపోయి కుప్పకూలి మృతి చెందాడు. హరిప్రసాద్ మృతి వార్త తెలుసుకున్న గ్రామస్తులు అతడి కుటుంబసభ్యులు ఆ శవాన్ని వారి ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా అనుమతించలేదు. కరోనా వైరస్ కారణంగానే హరిప్రసాద్ మరణించి ఉంటాడనే అనుమానంతో గ్రామస్తులే కాదు.. అతడి కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా శవాన్ని ముట్టుకునే ధైర్యం చేయలేదు. దీంతో హరిప్రసాద్ శవాన్ని ఇదిగో ఇలా అనాధ శవంలా ఊరి బయటే ఉంచేశారు. Also read : ఏపీలో కరోనా విజృంభణ.. తాజాగా 60 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి
మిట్టపల్లి గ్రామస్తుల ద్వారా హరిప్రసాద్ మృతి గురించి సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. హరిప్రసాద్ శవం నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించి కోవిడ్-19 పరీక్షలు జరపగా.. అతడికి కరోనా పాజిటివ్ లేదని తేలింది. టీబీ పేషెంట్ అయిన హరిప్రసాద్.. మండుటెండల్లో 150 కిమీ కాలినడకన నడవడంతో శరీరం డీహైడ్రేట్ అయి చనిపోయినట్టుగా వైద్యులు తెలుసుకున్నారు.
Also read : Coronavirus పుట్టుకపై అమెరికా ఇంటెలీజెన్స్ కీలక ప్రకటన
హరిప్రసాద్ మృతికి అసలు కారణం తెలుసుకున్న అనంతరం పోలీసుల సహాయంతో కుటుంబసభ్యులు శవానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటనపై సెక్షన్ 174 సీఆర్పీసీ ప్రకారం అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..