షోయబ్ అక్తర్ బయోపిక్.. తెరపైకి సల్మాన్ ఖాన్ పేరు

షోయబ్ అక్తర్ రియల్ స్టోరీ ఆధారంగా బయోపిక్ (Shoaib Akhtar`s biopic) రూపొందిస్తే.. ఆ సినిమాలో షోయబ్ అక్తర్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే బాగుంటుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా షోయబ్ అక్తరే తనపై బయోపిక్ వస్తే ఎలా ఉంటుందని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

Last Updated : May 6, 2020, 06:55 PM IST
షోయబ్ అక్తర్ బయోపిక్.. తెరపైకి సల్మాన్ ఖాన్ పేరు

షోయబ్ అక్తర్ రియల్ స్టోరీ ఆధారంగా బయోపిక్ (Shoaib Akhtar`s biopic) రూపొందిస్తే.. ఆ సినిమాలో షోయబ్ అక్తర్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే బాగుంటుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా షోయబ్ అక్తరే తనపై బయోపిక్ వస్తే ఎలా ఉంటుందని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని చెబుతూ.. ఒకవేళ అలాంటి బయోపిక్ అంటూ రూపొందితే, అందులో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తే బాగుంటుంది (Salman Khan as Shoaib Akhtar) అని షోయబ్ అక్తర్ చెప్పినట్టుగా ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఓ ట్వీట్ చేశాడు. షోయబ్ అక్తర్ బయోపిక్‌పై చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also read : Liquor Shops: మందు బాబులకు షాక్ ఇచ్చిన అధికారులు

సల్మాన్ ఖాన్ అంటే షోయబ్ అక్తర్‌కి ఎంతో ఇష్టం. సల్మాన్ ఖాన్‌కి ఆయన పెద్ద ఫ్యాన్ కూడా. 2016లో దుబాయ్‌లో సల్మాన్‌ని కలిసిన షోయబ్.. బాలీవుడ్ స్టార్ హీరోతో సెల్ఫీ తీసుకుని సంబరపడటం తెలిసిందే. బీయింగ్ హ్యూమన్ పేరిట సల్మాన్ ఖాన్ చేస్తోన్న సేవ ఎంతో అభినందించదగినది అని షోయబ్ అక్తర్ అప్పట్లోనే తన అభిమాన హీరోను ఆకాశానికెత్తేశాడు.

Also read : ఏపీలో మరో 60 మందికి కరోనా

సినిమాల్లో బయోపిక్స్‌కి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ప్రముఖ క్రీడాకారుల రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కే బయోపిక్స్‌కి ఇంకా మరింత ఆధరణ ఉంది. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందుకేనేమో ఇప్పుడు షోయబ్ అక్తర్ బయోపిక్ ప్రస్తావన తెరపైకొచ్చింది.

Also read : మద్యం మత్తులో పామును కరకర నమిలేశాడు!

ఇదిలావుంటే, ఇక షోయబ్ అక్తర్ కెరీర్ విషయానికొస్తే.. పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు ఆడిన షోయబ్.. టెస్ట్ మ్యాచుల్లో 178, వన్డేల్లో 247 వికెట్స్ తీసుకున్నాడు. 15 టీ20 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. ప్రపంచ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ బౌలర్ల జాబితాలో ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌కి ఓ ప్రముఖ స్థానం ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News