లాక్డౌన్ వేళలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. ఇదివరకే గత నెలలో ఓసారి పెళ్లి వాయిదా వేసుకున్న నిఖిల్, మంచి ముహూర్తం ఉందని తప్పనిసరి పరిస్థితుల్లో నిరాడంబర పెళ్లికి ఓకే చెప్పాడు. నేటి ఉదయం హైదరాబాద్, శామిర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో నిఖిల్, పల్లవి వర్మల పెళ్లి కొందరి సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఉదయం 6 గంటల 31 నిమిషాలకు శుభ ముహూర్తం నిర్ణయించారు. హిందూ సంప్రదాయంలో శాస్త్రోక్తంగా పెళ్లి జరిగింది. Photos: హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు
హీరో నిఖిల్ పెళ్లి నేపథ్యంలో వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువు పల్లవి వర్మ తరఫున ముద్రించిన కలిదిండి వారి కళ్యాణ శుభలేఖ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నరసాపురం మండలం దర్భరేవు వాస్తవ్యులు స్వర్గీయ కలిదిండి చిన్న సత్యనారాయణ రాజు, చిన్న సీతమ్మ దంపతుల చిన్న కుమార్తె వెంకట నాగలక్ష్మి పల్లవి (పల్లవి వర్మ)ని హైదరాబాద్ వాస్తవ్యులు కావలి శ్యామ్ సిద్ధార్థ, వీణా సిద్ధార్థ దంపుతల పెద్ద కుమారుడు నిఖిల్ సిద్ధార్థ్‌కు ఇచ్చి వివాహం జరిపించనున్నట్లు శుభలేఖలో ఉంది. రానా దగ్గుబాటి లవర్ ఫొటోలు చూశారా!
శామిర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య భౌతిక దూరం (సోషల్ డిస్టాన్సింగ్) పాటిస్తూ నిఖిల్, పల్లవి వర్మ వివాహం చేసుకున్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!