COVID-19 hospital: ఆచూకీ దొరికింది.. కానీ ప్రాణమే లేదు..

తానే దగ్గరుండి మరి అనారోగ్యంతో ఉన్న తన భర్తను కోవిడ్ (Covid-19 Hospital) ఆసుపత్రిలో చేర్చింది.. ఇంటికెళ్లి వచ్చి మరుసటి రోజు చూస్తే తన భర్త కనబడలేదు. దీంతో ఆమె తల్లడిల్లుతూ.. పది రోజుల నుంచి తన ఆచూకీ చెప్పండి అంటూ కనబడ్డ ప్రతీఒక్కరిని వేడుకుంది. చివరకు ఆ వృద్ధురాలికి భర్త ఆచూకీ దొరికింది కానీ.. ఆయన ప్రాణాలతో లేడు. దాదాపు తొమ్మిది రోజుల నుంచి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసి గుండెపగిలేలా విలపించింది. 

Last Updated : Jul 4, 2020, 11:34 AM IST
COVID-19 hospital: ఆచూకీ దొరికింది.. కానీ ప్రాణమే లేదు..

Missing old man found dead: తానే దగ్గరుండి మరి అనారోగ్యంతో ఉన్న తన భర్తను కోవిడ్ ( COVID-19 ) ఆసుపత్రిలో చేర్చింది.. ఆధార్ కార్డు అడిగారు కదా అని ఇంటికెళ్లి వచ్చి మరుసటి రోజు చూస్తే తన భర్త కనబడలేదు. దీంతో ఆమె తల్లడిల్లుతూ.. పది రోజుల నుంచి తన ఆచూకీ తెలపండి అంటూ కనబడ్డ ప్రతీ ఒక్కరిని వేడుకుంది. చివరకు ఆ వృద్ధురాలికి భర్త ఆచూకీ దొరికింది కానీ.. అప్పటికి ఆయన ప్రాణాలతో లేడు. దాదాపు తొమ్మిది రోజుల నుంచి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసి గుండెపగిలేలా విలపించింది. ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) విజయవాడలోని కోవిడ్-19 ప్రభుత్వ ఆసుపత్రిలో (Covid-19 hospital) సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన ఈ హృదయ విదారక సంఘటన అందరినీ కలచివేసింది. Also read: COVID19‌ ఆసుపత్రి నుంచి పేషెంట్ అదృశ్యం

తొమ్మిది రోజులు మార్చురీలోనే మృతదేహం..
విజయవాడ ( Vijayawada ) వన్‌టౌన్‌ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వన్‌టౌన్‌కు చెందిన ధనలక్ష్మీ అనే వృద్ధురాలు జూన్ 24న అనారోగ్యంతో ఉన్న తన భర్త వసంతరావు(63)ను విజయవాడలోని కోవిడ్ ఆసుపత్రికి (COVID-19 hospital ) తీసుకొచ్చింది. సిబ్బంది ఆధార్‌ కార్డు కావాలని అడగడంతో ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్లి మరుసటిరోజు 25న ఆసుపత్రికి వచ్చింది. తన భర్త గురించి సిబ్బందిని అడగగా.. అలాంటి పేరుతో ఎవరూ లేరని చెప్పారు. దీంతో అప్పటినుంచి తన భర్త ఫొటోను తీసుకోని ఆచూకీ చెప్పాలంటూ.. కనిపించిన ప్రతీఒక్కరిని వేడుకుంది. ఆ తర్వాత వృద్ధురాలి ఫిర్యాదు మేరకు 29న మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. Also read:
Ponnur MLA: పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు కోవిడ్ పాజిటీవ్

మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. సీసీ కెమెరాలో వసంత రావును వీల్ ‌చైర్‌లో ఆసుపత్రిలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీనిలో భాగంగా శుక్రవారం ఆసుపత్రిలోని ప్రతీ భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మార్చురీలో ఉన్న మృతదేహాలను కూడా పరిశీలించగా అక్కడ వసంత రావు ఆచూకీ లభ్యమైంది. తన భర్త మృతదేహాన్ని గుర్తుపట్టి ధనలక్ష్మీ గుండెపగిలేలా రోదించింది. అయితే వారికి బంధువులెవరూ లేకపోవడంతో శుక్రవారం కార్పొరేషన్ సిబ్బందే దహన సంస్కారాలు నిర్వహించారు. 

గుర్తుతెలియని వ్యక్తిగా రిజిస్టర్‌లో నమోదు..
జూన్ 24న శ్వాస సమస్యతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వసంతరావును ఆయన భార్య ధనలక్ష్మీ కోవిడ్(Covid) ఆసుపత్రిలో చేర్చి ఆధార్‌కార్డు కోసం ఇంటికెళ్లిందని ఎస్ఐ తెలిపారు. అయితే, అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిబ్బంది ఆయనకు ఆక్సిజన్ పెట్టి వైద్యం అందించారని, ఆ సమయంలో ఆయన వెంట ఎవ్వరూ లేకపోవడంతో అతడి వివరాలేవీ నమోదు చేసుకోలేదని పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తిగా చికిత్స అందిస్తున్న క్రమంలోనే జూన్ 25న తెల్లవారుజామున వసంతరావు మృతిచెందాడన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కరోనా (Coronavirus)టెస్ట్ చేయగా.. నెగిటీవ్ వచ్చింది. దీంతో గుర్తుతెలియని మృతదేహంగా రిజిస్టర్‌లో నమోదు చేసి మార్చురీలోనే ఉంచారని ఎస్ఐ పేర్కొన్నారు. ఇదిలాఉంటే విజయవాడ కోవిడ్ (Covid) ఆసుపత్రిలో కలకలం సృష్టించిన ఈ ఘటనపై కలెక్టర్ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.

Trending News