Telangana: అందుబాటులోకి TIMS సేవలు..

తెలంగాణాలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజలను తీవ్ర ఆందోళనను కల్గిస్తున్నాయి. అంతేకాకుండా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తుండడంతో ఆందోళన అధికమవుతోంది.

Last Updated : Jul 6, 2020, 03:39 PM IST
Telangana: అందుబాటులోకి TIMS సేవలు..

హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజలను తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. అంతేకాకుండా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తుండడంతో ఆందోళన అధికమవుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో అప్రమత్తమైంది. తెలంగాణలో భారీగా కరోనా కేసులు

 Also Read: SBI New Rules To Withdrawal: ఎస్‌బిఐ ఏటీఎం నిమయాలు మారాయి
ఇదిలాఉంటే ఒకవైపు ప్రభుత్వ పరమైన ఏర్పాట్లతోపాటు మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రులలోను బెడ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా హోటల్స్ ను కూడా వినియోగించుకునేలా ప్రణాలికను రూపకల్పన చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో మాత్రమే సేవలు కొనసాగుతున్నాయి. ఇకపై  గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ TIMS (Telangana Institute of Medical Sciences)ను అందుబాటులోకి తీసుకురానుంది. 

 Also Read : USA: అమెరికాలో విమాన ప్రమాదం: 8 మంది మృతి

Trending News