ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఒకడని తెలిసిందే. అయితే గంగూలీ ట్వంటీ20 ఫార్మాట్‌కు పనికిరాడని తాను ముందే ఊహించానంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాజీ కోచ్ జాన్ బుచానన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి గంగూలీ గేమ్ చివరి దశకు చేరుతున్న సమయంలో, అతడు ఫామ్ కోల్పోతున్న రోజుల్లో 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైంది. గంగూలీ తొలుత కెప్టెన్‌గా మాత్రమే పనికిరాడని భావించానని, అయితే ఆటగాడిగా సైతం పూర్తిగా విఫలమయ్యాడని బుచానన్ వ్యాఖ్యానించాడు. CSK: సురేష్ రైనా ఎక్కువేం కాదు: సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ
స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. గంగూలీ తొలి సీజన్లో కేకేఆర్ కెప్టెన్‌గా చేయగా ఆ సీజన్లో జట్టు 6వ స్థానంలో నిలిచింది, నా నిర్ణయంతోనే మరుసటి ఏడాది బ్రెండన్ మెకల్లమ్‌కు పగ్గాలు అప్పగిస్తే పూర్తిగా విఫలమయ్యాం. ఆ తర్వాత 2010లోనూ కేకేఆర్ కెప్టెన్‌గా చేసినా గంగూలీ ఐపీఎల్ ట్రోఫీ అందించలేకపోయాడని గుర్తు చేశాడు. FIDE Chess Olympiad: 96 ఏళ్లలో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత్
ఈ విషయాలపై తాను గంగూలీతో సైతం చర్చించి, తన అభిప్రాయాన్ని తెలిపినట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2011, 2012 సీజన్లలో పుణే వారియర్స్‌కు సైతం కెప్టెన్‌గా వ్యవహరించినా గంగూలీ రాణించలేకపోయాడు. టీ20 అనేది వేగవంతమైన గేమ్ అని, అతి త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, గంగూలీలో ఆ లక్షణాలు లేవని భావించినట్లే ఫలితాలు వచ్చాయి. కానీ ఆటగాడిగా సైతం దాదా విఫలమయ్యాడని, అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడని బుచానన్ వివరించారు. Virat Kohli: బ్యాట్ పట్టాలంటే భయం వేసింది: కోహ్లీ
Kieron Pollard: భీకర ఫామ్‌తో ఐపీఎల్‌కు పోలార్డ్