Indo-china Border: సరిహద్దులో మళ్లీ బాహాబాహీ

సరిహద్దు ఘర్షణపై ఓ వైపు చర్చలు జరుగుతుండగానే...డ్రాగన్ దుందుడుకు వైఖరి మాత్ర మానడం లేదు. భారత జవాన్లపై కాల్పులకు దిగడంతో..భారత్ ఎదురుదాడికి దిగింది.

Last Updated : Sep 8, 2020, 07:02 PM IST
Indo-china Border: సరిహద్దులో మళ్లీ బాహాబాహీ

సరిహద్దు ఘర్షణ ( Border Dispute ) పై ఓ వైపు చర్చలు జరుగుతుండగానే...డ్రాగన్ ( Dragon ) దుందుడుకు వైఖరి మాత్ర మానడం లేదు. భారత జవాన్లపై కాల్పులకు దిగడంతో..భారత్ ఎదురుదాడికి దిగింది.

భారత చైనా సరిహద్దు వివాదం ( Indo china border dispute ) , ఘర్షణ నేపధ్యంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయినా సరే చైనా దురాలోచన మానడం లేదు. సోమవారం రాత్రి , మంగళవారం వరుసగా రెజాంగ్ లా హైట్స్ వద్ద భారత ఆర్మీ ( Indian army ) తో తలపడింది డ్రాగన్ సైన్యం. పర్వత ప్రాంతంపై ఉన్న ఇండియన్ ఆర్మీను తరిమికొ ట్టే ఆలోచనతో చైనా సైనికులు ఒప్పందానికి తూట్లు పొడిచారు. నియంత్రణ రేఖ వెంబడి భారత స్థావరాలపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా భారత ఆర్మీ ఎదురుకాల్పులు జరిపింది. రెండువైపులా కాస్సేపు కాల్పుల అనంతరం పరిస్థితి అదుపులో వచ్చినట్టు తెలుస్తోంది. 

రెజాంగ్ లా హైట్స్ ప్రాంతంలో రెండు దేశాల సైనికుల మధ్య బాహాబాహీ ఘర్షణ చెలరేగినా సరే ఇరు దేశాల సైనికుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. చైనా దుందుడుకు వైఖరి నేపధ్యంలో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ జరగనుంది. Also read: Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు

Trending News