అమరావతి భూముల కుంభకోణం ( Amaravati lands scam ) కేసులో ఏపీ ప్రభుత్వం ( Ap government ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ దర్యాప్తుగా హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేస్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో భూముల కుంభకోణం జరిగిందనేది ప్రభుత్వ అభియోగం. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ కేసు ( Acb Enquiry ) కూడా నమోదు చేసింది. ముఖ్యంగా మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ( Acb case on Ex Advocate general ) పై కేసు నమోదైంది. అయితే ఏపీ హైకోర్టు ( Ap High court ) ఈ కేసులో స్టే ఇవ్వడమే కాకుండా దర్యాప్తు నిలిపివేయాలంటూ ఆదేశించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎఫ్ఐఆర్ ( FIR ) ను ఏ మీడియా కూడా ప్రచురించకూడదని సైతం ఆంక్షలు విధించడం సంచలనమైంది. ఇది పూర్తిగా అసాధారణ చర్య అని..రాజ్యాంగ వ్యతిరేకమనే వాదనలు మొదలయ్యాయి. ముఖ్యంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా హైకోర్టు నిర్ణయాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా పలువురు మేధావులు, న్యాయనిపుణులు, రాజకీయ నేతలు హైకోర్టు నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి.
ఈ నేపధ్యంలో హైకోర్టు ఇచ్చిన స్టేను ( To vacate high court stay ) సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే ను వెకేట్ చేయాలంటూ పిటీషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తుపై స్టే విధించడం వల్ల కీలకమైన ఆధారాలను నిందితులు నాశనం చేసే అవకాశముందని పిటీషన్ లో పేర్కొంది ప్రభుత్వం. ఎఫ్ఐఆర్‌ను రిపోర్ట్ చేయవద్దని మీడియాపై నిషేధం విధించారని, ఎఫ్ఐఆర్ పై పిటిషనర్ ప్రశ్నించనప్పటికీ దానిపై కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్ లో తెలిపింది. అమరావతిలో భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ ( insider trading ) కుంభకోణం జరిగిందని..కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో స్పష్టం చేసింది. Also read: AP: రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు
Amaravati land scam: హైకోర్టు స్టేను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు