ప్రతిష్ఠాత్మక వ్యవసాయబిల్లుపై కేంద్ర ప్రభుత్వ ( Central Government ) మాటే నెగ్గింది. ప్రతిపక్షాల భారీ వ్యతిరేకత మధ్య పార్లమెంట్ ( Parliament ) ఆమోదించిన వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి సైతం ఆమోదముద్ర వేశారు.
భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన మూడు కొత్త వ్యవసాయ బిల్లులను ( Three New Agriculture Bills ) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లులను లోక్ సభ ( Loksabha ) లో అటు రాజ్యసభ ( Rajyasabha ) లో ఆమోదించుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా బిల్లుల ఆమోదం సమయంలో ప్రతిపక్షాలు భారీగా ఆందోళన చేపట్టాయి. ఎన్డీయే భాగస్వామ్య పార్టీకు చెందిన కేంద్ర మంత్రి ఈ బిల్లుకు వ్యతిరేకంగా రాజీనామా కూడా చేశారు. అంతేకాదు ఆ పార్టీ ఎన్డీయే కూటమి ( NDA Alliance ) నుంచి వైదొలగింది కూడా. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం సందర్బంగా చెలరేగిన ఆందోళనను దృష్టిలో పెట్టుకుని కొందరు రాజ్యసభ సభ్యులపై వేటు కూడా పడింది.
మరోవైపు ఈ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దాదాపు 20కు పైగా రైతు సంఘాలు కలిసి భారత్ బంద్ ( Bharat Bandh ) తలపెట్టాయి. వ్యవసాయబిల్లులను ఆమోదించవద్దని..తిప్పి పంపాలని ప్రతిపక్ష ప్రతినిధులు, రైతు సంఘాలు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ( president Ramnath kovind ) ను కోరాయి. రాజ్యసభలో ఈ బిల్లుల్ని కేంద్రం రాజ్యాంగవిరుద్ధంగా ఆమోదింపజేసుకుందని ప్రతిపక్షాసలు ఆరోపించాయి. ఈ బిల్లులు రైతు ప్రయోజనాలకు విరుద్ధమని రైతు సంఘాలు కొద్ది రోజులుగా ఆందోళన కూడా నిర్వహిస్తున్నాయి. హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకిస్తూ రైతులు నిరసన జరిగింది. ఈ బిల్లుల కారణంగా రైతుల్ని కార్పొరేట్ వ్యాపారులు శాసిస్తారని, మద్దతు ధర వ్యవస్థే కనుమరుగవుతుందనేది ప్రధాన ఆరోపణగా ఉంది.
అటు ప్రభుత్వం మాత్రం ఈ ఆందోళనను పట్టించుకోకుండా..కొత్త వ్యవసాయ బిల్లులు రైతుల ప్రయోజనాలకు దోహదపడతాయని..దళారీ వ్యవస్థ అనేది దూరమవుతుందని అంటోంది. మొత్తానికి ఈ వివాదాస్పద మూడు వ్యవసాయ బిల్లుల్ని తిప్పి పంపాలన్న ప్రతిపక్షాల అభ్యర్ధనను రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తిరస్కరించారు. మూడు వ్యవసాయబిల్లులకు ఆమోదముద్ర ( Kovind given his assent to the agri bills ) వేశారు. Also read: Indo-china Border: యుద్ధానికి సంసిద్ధమైన భారత ఆర్మీ, టీ90 ట్యాంకుల మొహరింపు