గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై (GHMC ) తను అన్న మాటలను వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయని మంత్రి కేటీఆర్అ న్నారు. అసత్య ప్రచారం అని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చారు.
ALSO READ | Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్
వాస్తవానికి జీహెహ్ ఎంసి చట్టం ప్రకారం నవంబర్ రెండో వారం తరువాత ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు అని, ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు, నాయకులు సిద్ధంగా ఉండాలని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికలు నిర్వహించడం, దాని గురించి ప్రక్రియ, షెడ్యూల్ వంటి వివరాలు వెల్లడించడం అనేవి కమిషన్ పరిధిలోకి వచ్చే అంశాలు అని తెలిపారు. తన మాటలను మరోరకంగా వక్రీకరించారని..ఇది సరికాదన్నారు కేటీఆర్ ( KTR ).
నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది. 1/2
— KTR (@KTRTRS) September 30, 2020
అసలు కేటీఆర్ అన్నదేమిటి?
రూల్స్ ప్రకారం నవంబర్ రెండో వారం తరువాత ఎప్పుడైనా జీహెచ్ ఎంసి ఎలక్షన్స్ జరగవచ్చు. దానికి సిద్ధంగా ఉండాలి అని ఆయన తెలిపారు. దాంతో పాటు వివిధ సర్వేల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టికి ( TRS ) 91 శాతం సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ| Kane Williamson Memes: కేన్ విలియమ్సన్ పై ట్రెండ్ అవుతున్న మేమ్స్
భాగ్యనగరాన్ని డెవలెప్ చేయడానికి చాలా కష్టపడ్డాం అని, పరిశ్రమలు రావడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించామని, ధరణి పోర్టల్ పై అవగాహన కల్పించడానికి ప్రచారం చేద్డామన్నారు కేటీఆర్.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR