Telangana: తాజాగా 2,009 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది.

Last Updated : Oct 2, 2020, 10:26 AM IST
Telangana: తాజాగా 2,009 కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది. గత 24 గంటల్లో గురువారం ( అక్టోబరు 1 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 2,009 కరోనా కేసులు నమోదు కాగా.. 10 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,609 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,145 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,65,844 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 28,620 మంది చికిత్స పొందుతున్నారు.  Also read: Hathras Case: ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ ఛటర్జీ

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా గురువారం 54,098 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 1 వరకు రాష్ట్రంలో 31,04,542 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 84.78 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా 293 కేసులు నమోదయ్యాయి. Also read: Hathras Case: అర్థరాత్రి దహన సంస్కారాలపై వివరణ ఇవ్వండి: మహిళా కమిషన్

Trending News