/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Heavy rains in Andhra Pradesh and Telangana: అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల (Heavy rains) ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో రోబోయే నాలుగురోజుల్లో ఇరురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి తీవ్ర వాయుగుండంగా మారి.. మంగళవారం ఉత్తరాంధ్ర సరిహద్దు వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో విస్తారంగా వర్షాలు
కురిశాయి. గత రెండు రోజుల నుంచి ఇరు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మరింత తీవ్రరూపం దాల్చడంతో.. మళ్లీ ఇరు రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఆదివారం ఉదయం తెలిపింది. Also read: 
Rahul Gandhi slams PM Modi సైనికులకు సాధారణ ట్రక్కులు.. ప్రధానికి రూ. 8.400 కోట్ల విమానమా ?

ఇదిలాఉంటే.. ఉత్తర అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఈనెల 14న కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణకోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో కోస్తా తీరంలో గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు ఈనెల 12 వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికను సైతం జారీ చేసింది. Also read : Air India One: ప్రధాని మోదీ కోసం అమెరికా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలు ఇవే

ఇక తెలంగాణలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌ (Hyderabad) ను అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిన సంగతి తెలిసిందే. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. Also read : China on coronavirus: కరోనావైరస్ పుట్టింది చైనాలో కాదు: చైనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Section: 
English Title: 
Low pressure in the Bay of Bengal, Heavy rain forecast for Andhra Pradesh and Telangana
News Source: 
Home Title: 

Heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇరు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇరు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Caption: 
File photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇరు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Publish Later: 
No
Publish At: 
Sunday, October 11, 2020 - 07:53