ఎల్ఆర్ఎస్ మీద తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) 2015 కింద గతంలో దరఖాస్తు చేసుకున్నవారు తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ఉన్న నిబంధనలు, షరతులు తాజా పథకంలోనూ ఒకే విధంగా ఉన్నాయని తెలిపారు. కనుక పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకునేందుకు (Applications under LRS 2015 to be disposed) మంత్రి కేటీఆర్ నుంచి అనుమతి లభించింది.
Also Read : Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. షాకిస్తున్న వెండి ధరలు
2015 దరఖాస్తుల పరిశీలనకు అనుమతి
పాత ఎల్ఆర్ఎస్ సమయంలో చేసుకున్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం 2015 (LRS Scheme 2015) కింద ఈ ఏడాది జనవరి 31 వరకు వచ్చిన దరఖాస్తులను లెక్కలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌లకు అధికారులకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరితో పాటు మున్సిపల్ కమిషనర్లు, మునిసిపాలిటీ అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe