హైదరాబాద్ నగర వాసులకు మరో శుభవార్త. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇదివరకే దుర్గం చెరువును సుందరీకరణ చేశారు. తాజాగా నగరంలో మరో స్టీల్ వంతెనను నిర్మించేందుకు టీఆర్ఎస్ సర్కార్ ఆమోదం తెలిపింది. దుర్గం చెరువు తరహాలోనే మరో ఏరియాలో సుందరీకరణతో పాటు పాదచారుల సమస్యలు తీరనున్నాయి.
Also Read ; Jeevitha: రాజశేఖర్ కండీషన్ చూసి భయపడ్డాం.. కానీ: జీవిత వీడియో సందేశం
మెహిదీపట్నంలో పాదచారుల కోసం స్కైవాక్‌ను నిర్మించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. మెహిదీపట్నం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పాదచారులకు ఈ సమస్య తెలిసిందే. రోడ్డు దాటడానికి నరకయాతనలా ఉంటుంది. ఈ నేపథ్యంలో మెహిదీపట్నం స్కై వాక్ నిర్మాణానికి తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు.
Also Read : Bigg Boss Telugu 4 Voting Numbers: బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్ ఇవే...
#Mehdipatnam finally gets pedestrian skywalk (to cross over one of most congested roads) & ~500 mtrs steel skyway + 16 lifts (incl 2 in rythu bazaar)!
Minister @KTRTRS has approved detailed designs & @HMDA_Gov calls for bids
Bus shelters also get redesigned as part of project pic.twitter.com/Luz5f0o3iO
— Arvind Kumar (@arvindkumar_ias) November 4, 2020
స్కైవాక్‌కు సంబంధించిన కొంత సమాచారం షేర్ చేశారు. మెహిదీపట్నంలో ఆ బస్ షెల్టర్స్‌ను రీడిజైన్ చేయనున్నారు. పాదాచారుల కోసం 500 మీటర్ల పొడవున స్టీల్‌తో స్కైవాక్ నిర్మించనున్నారు. మొత్తం 16 లిఫ్ట్‌లను ఏర్పాటు చేయనుండగా.. ఇందులో రైతు బజార్‌లో రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేసేందుకు డిజైన్ రూపొందించారు. త్వరలోనే దీనికి సంబంధించి పనుల కోసం టెండర్లను ఆహ్వానిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe