Radhe Shyam Movie Update: ఇటలీ నుంచి ముంబై చేరుకున్న ప్రభాస్

టాలీవుడ్ హీరో ప్రభాస్ (Prabhas) బాహుబలి చిత్రం తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్డమ్‌ను సంపాందించుకున్నాడు. అయితే సాహో చిత్రం త‌ర్వాత ఈ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధేశ్యామ్ (Radhe Shyam Movie) చిత్రంలో నటిస్తున్నాడు.

Last Updated : Nov 7, 2020, 01:53 PM IST
Radhe Shyam Movie Update: ఇటలీ నుంచి ముంబై చేరుకున్న ప్రభాస్

Prabhas returns from 'RadheShyam' shoot in Italy: టాలీవుడ్ హీరో ప్రభాస్ (Prabhas) బాహుబలి చిత్రం తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్డమ్‌ను సంపాందించుకున్నాడు. అయితే సాహో చిత్రం త‌ర్వాత ఈ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధే శ్యామ్ (Radhe Shyam Movie) చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్‌ 20వ చిత్రం రాధే శ్యామ్‌ (Radhe Shyam) పీరియాడికల్‌ లవ్‌స్టోరిని రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను రెబల్ స్టార్ క్రిష్ణం రాజు ప్రజెంట్ చేస్తుండగా.. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రభాస్అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ఇటలీలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్కడి కీలక సన్నివేశాల షూటింగ్‌ను పూర్తిచేసుకోని ప్రభాస్ శుక్రవారం రాత్రి ముంబై (Mumbai ) చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ముంబై చేరుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇదిలాఉంటే.. ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ఈ చిత్రానికి సబంధించి బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ ( Beats Of Radhe Shyam ) పేరుతో విడుదల చేసిన వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. Also read: Prabhas Birthday: ‘రాధే శ్యామ్’ స్టన్నింగ్ స‌ర్‌ప్రైజ్ ఇదే..

అయితే ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే కాకుండా ఇతర ప్రధాన పాత్రలలో జగపతి బాబు, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జయరామ్, సచిన్ ఖేద్కర్, భీనా బెనార్జీ, మురళి శర్మ, షాషా చెత్రి, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సత్యన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. Also read: Prabhas: ప్రభాస్ మూవీలో కృతి సనన్ ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News