Nitish Kumar elected NDA leader: పాట్నా: బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో ఆదివారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సమావేశంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, వీఐపీ, హెచ్‌ఏఎమ్ పార్టీలు జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ (Nitish Kumar elected NDA leader) ను ఎన్నుకున్నాయి. దీంతోపాటు ఎన్డీఏ ఉప నేతగా బీజేపీ నాయకుడు సుశీల్ మోదీని ఎన్నుకున్నాయి. నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎమ్ పార్టీల ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలంతా కలిసి తదుపరి సీఎంగా నితీశ్‌కుమార్ పేరును ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు నితీశ్‌కుమార్ గవర్నర్‌ను కలిశారు.
Oath ceremony to be held tomorrow afternoon: JD(U) Chief Nitish Kumar after staking claim to form government #Bihar https://t.co/OrHiZJAOPl pic.twitter.com/W3oOAJ0uKf
— ANI (@ANI) November 15, 2020
రేపే ప్రమాణం..
బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (Nitish Kumar) సోమవారం (నవంబర్ 16) ఉదయం 11:30 గంటలకు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. అయితే అంతకుముందు నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీని రద్దు చేసి తన రాజీనామాను గవర్నర్ ఫాగు చౌహాన్‌కు అప్పగించారు. Also read: Narendra Modi: స్ఫూర్తి ప్రదాత బిర్సా ముండా: ప్రధాని మోదీ
JD(U) Chief Nitish Kumar named as the next Chief Minister of Bihar, in NDA meeting at Patna
Visuals from NDA meeting at Patna, Bihar pic.twitter.com/Xz8Fr0WDw5
— ANI (@ANI) November 15, 2020
తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో (Bihar Assembly election 2020) ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. బీజేపీ 74, జేడీయూ 43, హెఏఎమ్ 4, వీఐపీ 4 గెలుచుకున్నాయి. అయితే తేజస్వీ సారధ్యంలోని మహాఘట్‌బంధన్ 110 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. Also read: #WATCH: -20 డిగ్రీల చలిలో.. జవాన్ల దీపావళి వేడుకలు
Also read: Telangana: గోదావరిలో నలుగురు యువకుల గల్లంతు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe