బిగ్ బాస్ మొదలై పది వారాలు దాటి పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. కరోనా వల్ల కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి ముందే 14 రోజులు క్వారంటైన్ అయిన సంగతి తెలిసిందే. అప్పటినుండే హౌజ్‌మేట్స్ వాళ్ల కుటుంబాలకు దూరమయ్యారు. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న తమ పిల్లలను చూడడానికి కంటెస్టంట్స్ తల్లులు బిగ్ బాస్ హౌజ్‌కి వచ్చినట్టు ఈ రోజు విడుదలైన ప్రోమోలో చూడవచ్చు. కరోనా నిబంధనల కారణంగా బిగ్ బాస్ కంటెస్టంట్స్ వాళ్ల తల్లులు నేరుగా తమ పిల్లలను కలవకుండా మధ్యలో గ్లాస్‌ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌజ్‌లోకి అఖిల్, అభిజీత్, అవినాష్, హారికల తల్లులు ఒక్కొక్కరిగా వచ్చి కంటెస్టెంట్స్ అందరితో సరదాగా ముచ్చటించి వాళ్ల కన్నీళ్లను తుడిచి, వారి మాటలతో మారింత బలాన్ని అందించారు. అవినాష్ వాళ్ల అమ్మ ( Bigg Boss 4 contestant Avinash's mother ) అవినాష్ లానే డ్యాన్స్‌తో అందరినీ అలరించింది. అలాగే అవినాష్ ఊరికే పెళ్లి పెళ్లి అంటున్నాడు అని హౌజ్‌మేట్స్ అవినాష్ వాళ్ల అమ్మకు ఫిర్యాదు చేయగా.. "ఊకె పెళ్లి పెళ్లి అనకు బిడ్డ చేస్తా వచ్చినంక" అని వాళ్ల అమ్మ సమాధానం ఇవ్వడంతో హౌజ్‌లో ఉన్న వాళ్లంతా ఘొల్లుమన్నారు.
Family is an ocean of emotions ❤️ #BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/w77IqJJcEV
— starmaa (@StarMaa) November 18, 2020
దేత్తడి హారిక వాళ్ల అమ్మ ( Bigg Boss 4 contestant Dethadi Harika's mother ) మోనల్‌ని తెలుగు సరిగా వచ్చిందా అని అడుగుతూ "చాపు చాపు" అని ఇమిటేట్ చేసింది. హారిక తరువాతి వారంకి కెప్టెన్‌గా పోటీ చేయడానికి స్టార్ వచ్చిందని సంతోషంగా వాళ్ల అమ్మకి చెప్పగా.. ఈ సారైనా కెప్టెన్ అవుతావా అని హారికపై వాళ్ల అమ్మ కౌంటర్ వేసింది.
Also read : Bigg Boss 4 Telugu: ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం !
అఖిల్ వాళ్ల అమ్మ.. ఆడపిల్లలు లేరు కానీ ఉంటే హరిక లాంటి కూతురు కావాలి అని తన మనసులోని మాటను చెప్పింది. అభిజిత్ వాళ్ల అమ్మతో అవినాష్ " ఇక్కడ గొడవలన్నీ గేమ్ వరకే ఆంటీ మేమంతా మంచి ఫ్రెండ్స్" అని చెప్పగా అభిజిత్ వాళ్ల అమ్మ ( Bigg Boss 4 contestant Abhijeet's mother ) "కొట్టుకోండి.. అదే మజా" అని వాళ్లకి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. దీంతో కంటెస్టెంట్స్ అందరూ ఎగిరి గంతేశారు.
Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి