Monal Gajjar about Abhijeet: అభిజీత్ అది తగ్గించుకుంటే మంచిది: మోనల్ గజ్జర్

Bigg Boss Telugu 4 latest updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ గేమ్‌ దగ్గరపడింది. బిగ్ బాస్ 4 తెలుగు షోలో విన్నర్ ఎవరో ప్రకటించే సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 20 ఆదివారం నాడు బిగ్ బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే జరగనుండటంతో ప్రస్తుతం బిగ్ బాస్ ఫాలోవర్స్, షో ఆడియెన్స్ అందరి దృష్టి బిగ్ బాస్ హౌజ్ పైనే ఉంది.

Last Updated : Dec 18, 2020, 06:53 AM IST
  • బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలెపైనే బిగ్ బాస్ ఆడియెన్స్ ఫోకస్.
  • బిగ్ బాస్ హౌజ్‌లో సభ్యులు అభిజీత్, అఖిల్, అరియానా గ్లోరి, దేత్తడి హారిక, సోహెల్ మధ్య గట్టి పోటీ.
  • అభిజీత్ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటో చెప్పిన మోనల్ గజ్జర్.
Monal Gajjar about Abhijeet: అభిజీత్ అది తగ్గించుకుంటే మంచిది: మోనల్ గజ్జర్

Bigg Boss Telugu 4 latest updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ గేమ్‌ దగ్గరపడింది. బిగ్ బాస్ 4 తెలుగు షోలో విన్నర్ ఎవరో ప్రకటించే సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 20 ఆదివారం నాడు బిగ్ బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే జరగనుండటంతో ప్రస్తుతం బిగ్ బాస్ ఫాలోవర్స్, షో ఆడియెన్స్ అందరి దృష్టి బిగ్ బాస్ హౌజ్ పైనే ఉంది. బిగ్ బాస్ ఇంటిలో జరుగుతున్న ఆసక్తికరమైన పరిణామాలను ఓ కంట కనిపెడుతూనే.. మరోవైపు బిగ్ బాస్ హౌజ్ బయట సోషల్ మీడియాలో వారి అభిమానులు చేస్తున్న సందడిని గమనిస్తున్నారు.

ఇదిలావుంటే, గత వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన మోనల్ గజ్జర్ ( Bigg Boss contestant Monal Gajjar ) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌజ్ సభ్యులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన దృష్టిలో అఖిల్‌కి ( Bigg boss contestant Akhil ) అభిజీత్‌కి అంతగా తేడా కనిపించలేదన్న మోనాల్ గజ్జర్.. అభిజీత్‌లో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ గురించి కూడా చెప్పుకొచ్చింది. 

అభిజీత్ ( Bigg Boss contestant Abhijeet ) చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉంటాడని, సభ్యుల పట్ల గౌరవంగా ఉంటాడని మోనల్ గజ్జర్ పేర్కొంది. అయితే, అభిజీత్‌లో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుతూ.. అతడు కొన్నిసార్లు తాను మాత్రమే రైట్ అనుకుంటాడని.. ఆ ఇగోను పక్కనపెడితే అతడిని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరని మోనల్ గజ్జర్ వ్యాఖ్యానించింది.  

Also read : Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4: ఆమె పట్ల మరింత ఓపెన్ అవుతున్న అభిజీత్

మరోవైపు బిగ్ బాస్ హౌజ్‌లో ప్రస్తుతం ఉన్న అఖిల్, అభిజీత్, దేత్తడి హారిక ( Dethadi Harika), అరియానా గ్లోరి ( Ariyana Glory ), సోహెల్ ( Sohel ) ఎవరికి వారు తమకు తామే పోటీ అన్నట్టు దూసుకుపోతున్నారు. బిగ్ బాస్ 4 తెలుగు టైటిల్ విన్నర్ తామే అవుతామనే ధీమా వాళ్లందరిలోనూ కనిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు 4 ఫైనల్ ఎపిసోడ్ ( Bigg boss 4 Telugu grand finale episode ) పూర్తయితే కానీ అసలు విన్నర్ ఎవరో తేలే అవకాశం లేదు.

Also read : Bigg Boss 4 Telugu: హారికను పెళ్లి చేసుకుంటా : అనివాష్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News