Love story teaser: ఆకట్టుకుంటున్న చైతూ లవ్‌స్టోరీ

Love story teaser: భావోద్వేగం నిండిన ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. నాగ్ చైతన్య, సాయి పల్లవి జంటగా వస్తున్న లవ్‌స్టోరీ అలాంటిదే. హృదయాన్ని తడిపే ఆ ప్రేమకథా చిత్రం టీజర్ విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది.

Last Updated : Jan 11, 2021, 10:54 PM IST
Love story teaser: ఆకట్టుకుంటున్న చైతూ లవ్‌స్టోరీ

Love story teaser: భావోద్వేగం నిండిన ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. నాగ్ చైతన్య, సాయి పల్లవి జంటగా వస్తున్న లవ్‌స్టోరీ అలాంటిదే. హృదయాన్ని తడిపే ఆ ప్రేమకథా చిత్రం టీజర్ విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది.

సాయి పల్లవి ( Sai pallavi ), నాగ్ చైతన్య ( Nag Chaitanya ) జంటగా నటించిన లవ్‌స్టోరీ టీజర్ ( Love story teaser ) భావోద్వేగమైంది. శేఖర్ కమ్ముల స్పెషాలిటీ కన్పిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన మరో ప్రేమకథా చిత్రం లవ్‌స్టోరీ. తాజాగా విడుదలైన టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. జీరోకెల్లి వచ్చిన సార్..చాన కష్టపడతా..మంచి ప్లాన్ ఉంది అంటూ తెలంగాణ యాసలో చైతూ డైలాగ్‌తో ప్రారంభమయ్యే టీజర్..ఏందిరా వదిలేస్తవా నన్ను అంటూ బాధతో అడిగిన సాయి పల్లవి డైలాగ్‌తో ముగుస్తుంది.

సినిమాలో హీరోహీరోయిన్లు ఇద్దరూ ఊరు నుంచి పారిపోతారా అనేది ఆసక్తిగా మారింది. టీజర్‌లో అదే ప్రత్యేకంగా చూపించారు మరి. కలల్ని సాకారం చేసుకునేందుకు గ్రామం వదిలి..నగరానికి వచ్చిన రేవంత్, మౌనికల పరిచయం, ప్రేమలా మారడం, కష్టాల్ని అధిగమించి లక్ష్యసాధన కోసం చేసిన పోరాటం ఇతివృత్తంగా సాగిన కథే లవ్‌స్టోరీ ( Love story ). తెలంగాణ యాసను ప్రతిబింబించడంలో శేఖర్ కమ్ముల ( Sekhar kammula ) ప్రత్యేకతను చూపించారు. ఈ సినిమాకు పవన్ సి హెచ్ సంగీతం అందించగా..విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సినిమా తెరకెక్కిస్తున్నారు. 

Also read: PSPK 27: మొదలైన పవన్ కల్యాణ్ కొత్త సినిమా షూటింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News