PSPK 27: మొదలైన పవన్ కల్యాణ్ కొత్త సినిమా షూటింగ్

PSPK 27 shooting resumed | పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ క్రిష్‌కి COVID-19 సోకిన కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. కరోనావైరస్ సోకిన అనంతరం హోమ్ క్వారంటైన్ అయిన దర్శకుడు క్రిష్.. తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ ఇవాళ సోమవారం తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభించాడు.

Last Updated : Jan 11, 2021, 08:57 PM IST
  • కరోనావైరస్ సోకిన అనంతరం హోమ్ క్వారంటైన్ అయిన దర్శకుడు క్రిష్.
  • కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఇవాళ సోమవారం తిరిగి షూటింగ్ ప్రారంభించిన క్రిష్.
  • PSPK27 షూటింగ్ మినీ షెడ్యూల్ తర్వాత అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ షూటింగ్‌లో పాల్గొననున్న పవన్ కల్యాణ్.
PSPK 27: మొదలైన పవన్ కల్యాణ్ కొత్త సినిమా షూటింగ్

PSPK 27 shooting resumed | పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ క్రిష్‌కి COVID-19 సోకిన కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. కరోనావైరస్ సోకిన అనంతరం హోమ్ క్వారంటైన్ అయిన దర్శకుడు క్రిష్.. తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ ఇవాళ సోమవారం తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభించాడు. పీరియడిక్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. 

క్రిష్ సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ త్వరలోనే ఓ మిని షెడ్యూల్ పూర్తి చేసుకోనున్నారు. పవన్ కల్యాణ్ మిని షెడ్యూల్ షూటింగ్ పార్ట్ తర్వాత ఈ సినిమా కోసం గతేడాది వేసిన ఓ సెట్టింగ్‌ని కూల్చేయనున్నారు. ఈ మినీ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం పవన్ కల్యాణ్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ ( Ayyappanum koshiyum telugu remake ) షూటింగ్‌లో పాల్గొననున్నారు.

Also read : Vakeel Saab: వకీల్ సాబ్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్

పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబోలో వస్తున్న సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) సరసన నటించే హీరోయిన్స్‌లో ఒకరిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు ఖరారైంది. మెయిన్ హీరోయిన్ పేరు ఇంకా ఖరారు కాలేదు. ఇక వకీల్ సాబ్ మూవీ ( Vakeel Saab movie ) షూటింగ్ విషయానికొస్తే... ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ అయ్యింది.

Also read : Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌ రిలీజ్ డేట్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News