Covaxin: కరోనా టీకాలు వారికి మాత్రమే: భారత్ బయోటెక్ క్లారిటీ

Covaxin Only For Those Above 18 Years, Not For Children: భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్. జనవరి 16 నుంచి ఈ కోవాగ్జిన్ టీకాలు ఇవ్వడాన్ని దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 15, 2021, 12:20 PM IST
  • జనవరి 16 నుంచి ఈ కోవాగ్జిన్ టీకాలు ఇవ్వడాన్ని దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నారు
  • అత్యవసర వినియోగం నిమిత్తం భారత్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనుమతి పొందడం తెలిసిందే
  • జీ న్యూస్ మీడియాతో మాట్లాడిన భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా
Covaxin: కరోనా టీకాలు వారికి మాత్రమే: భారత్ బయోటెక్ క్లారిటీ

Covaxin Only For Those Above 18 Years, Not For Children: భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్. జనవరి 16 నుంచి ఈ కోవాగ్జిన్ టీకాలు ఇవ్వడాన్ని దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా అత్యవసర వినియోగం నిమిత్తం భారత్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనుమతి పొందడం తెలిసిందే. తొలి దశలో 1.6 కోట్ల టీకాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకోవాలా వద్దా అనే అనుమానాలు సైతం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా గురువారం జీ న్యూస్ మీడియాతో మాట్లాడి పలు విషయాలు వివరించారు. కోవాగ్జిన్(Covaxin) అనేది 18 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమేనని, చిన్నారులకు కాదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో వాక్సిన్ తీసుకురావడానికి మరో 6 నెలల సమయం పడుతుందన్నారు.

Also Read: Health Tips: ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..

చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. చిన్నారులపై ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తేనే.. వారికి కరోనా టీకాలు ఇవ్వాలా వద్దా అనే దానిపై తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. కోవాగ్జిన్ మార్కెట్‌లో రూ.1000కి లభ్యం అవుతుందని, మూడో దశ ప్రయోగాల ఫలితాలు మార్చి నెలలో వస్తాయని చెప్పారు. అయితే వ్యాక్సిన్ విషయంలో ఏ అనుమానాలు అక్కర్లేదని, పూర్తి విశ్వాసంతో టీకాలు(Corona Vaccine) తీసుకోవచ్చునని సూచించారు.

Also Read: Patnam Subbaiah: ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత

జనవరి 16న భారతదేశ వ్యాప్తంగా కరోనా టీకాలు ప్రారంభించనున్న నేపథ్యంలో కొన్ని విలువైన సూచనలు చేశారు. టీకాలు తీసుకున్న వారికి స్వల్ప జ్వరం, కొంతమేర నొప్పి లాంటి లక్షణాలు ఉన్నాయని.. కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్ కృష్ణా ఎల్లా చెప్పారు. అయితే మూడు రోజుల తర్వాత కూడా జ్వరం ఉంటే మాత్రం కచ్చితంగా ఆ వ్యక్తి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

Also Read: జనవరి 20 నుంచి Amazon గ్రేట్ రిపబ్లిక్ డే 2021 సేల్స్.. భారీ ఆఫర్లు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News