Airtel Hacked: హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. ప్రముఖ టెలీకాం సంస్థ ఎయిర్‌టెల్‌ను హ్యాక్ చేశారు. లక్షలాది కస్టమర్ల వ్యక్తిగత వివరాల్ని హ్యాకర్లు దొంగిలించడం ఆందోళనకు గురైంది.
హ్యాకింగ్ ( Hacking )ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. ఎయిర్టెల్ సంస్థ ( Airtel ) మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఏకంగా 25 లక్షలమంది వినియోగదార్ల వ్యక్తిగత వివరాల్ని హ్యాక్ చేశారు. హ్యాక్ చేయడమే కాకుండా ఆ సమాచారాన్ని అమ్మకానికి ( Hacked data for sale ) ఉంచడం ఆందోళన కల్గిస్తోంది. ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న కస్టమర్ల చిరునామా, నగరం, ఆధార్ కార్డు నెంబర్, జెండర్ వివరాల్ని ఎయిర్టెల్ సర్వర్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా దొంగిలించారని తెలుస్తోంది.
ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడైన రాజశేఖర్ రాజహర్యా ఈ విషయాన్ని వెల్లడించడంతో అందరూ షాక్ అయ్యారు. ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు. దేశంలోని ఎయిర్టెల్ వినియోగదార్ల ( Airtel customers data hacked ) వివరాల్ని విక్రయించాలనుకుంటున్నట్టు హ్యాకర్లు ప్రకటించడం కలవరానికి గురి చేస్తోంది. హ్యాకర్లు ( Hackers )..ఎయిర్టెల్ భద్రతా బృందాల్ని బ్లాక్ మెయిల్ చేసి 35 వందల విలువైన బిట్ కాయిన్లను వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాజశేఖర్ రాజహర్యా తెలిపారు. ఆ డీల్ విఫలం కావడతో బహిరంగ మార్కెట్లో విక్రయానికి ఉంచారని సమాచారం. హ్యాకర్లు తస్కరించిన డేటాలో ఎక్కువభాగం జమ్ముకాశ్మీర్ కస్టమర్లవని తెలుస్తోంది.
అయితే ఈ విషయాన్ని ఎయిర్టెల్ సంస్థ ప్రతినిధులు ఖండించారు. ఎయిర్టెల్ తన వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని..ఎలాంటి డేటా తమ నుంచి లీక్ కాలేదని తెలిపారు.
Also read: Tamilnadu Elections: గ్లామరస్‌గా తమిళ ఎన్నికలు, పోటీ చేయనున్న సినీ నటి రాధిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook