Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్ , రోజుకు వేయి కేసుల నమోదు

Maharashtra: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కొత్త స్టెయిన్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. పెద్దఎత్తున ఆంక్షలు విధిస్తున్నా సంక్రమణ పెరుగుతోంది. వరుసగా ఐదోరోజు కూడా భారీగా కేసులు నమోదయ్యాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 28, 2021, 08:43 PM IST
Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్ , రోజుకు వేయి కేసుల నమోదు

Maharashtra: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కొత్త స్టెయిన్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. పెద్దఎత్తున ఆంక్షలు విధిస్తున్నా సంక్రమణ పెరుగుతోంది. వరుసగా ఐదోరోజు కూడా భారీగా కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా కరోనా కొత్త స్ట్రెయిన్ ( New corona strain) ఆందోళన కల్గిస్తోంది. మహారాష్ట్రలో భారీగా కేసులు పెరుగుతుండటం కలవరం రేపుతోంది. వరుసగా  ఐదవ రోజు కూడా మహారాష్ట్రలో 987 కేసుల నమోదవడమే దీనికి కారణం. నలుగురు కరోనా కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 లక్షల 24 వేల 866కు చేరుకుంది.  మృతుల సంఖ్య 11 వేల 470కు చేరుకుంది. అమరావతిలో గత ఐదు రోజుల్లో 4 వేల 61 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కాగా 32 మంది మృతి చెందారు. పెరుగుతున్న కేసుల నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోకల్ రైలు సర్వీసులు తగ్గించాలని..తాత్కాలికంగా మాల్స్, వీక్లీ మార్కెట్లు ముూసేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే విదర్భ రీజియన్‌లోని 5 జిల్లాల్లో లాక్‌డౌన్ ( Lockdown) పొడిగించారు. అటు పూణేలో మార్చ్ 14 వరకూ స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని నిర్ణయించారు. అదే విధంగా కోచింగ్ సెంటర్లు, ఇతర విద్యాసంస్థల్ని మూసివేసేందుకు నిర్ణయించారు.

మహారాష్ట్ర( Maharashtra )లో 5 రోజుల్నించి రోజుుక వేయి కొత్త కేసులు నమోదవుతున్నాయి. యావత్‌‌మల్, వాసిం, అకోలా వంటి ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లను మార్చ్ 7వ తేదీ వరకూ మూసివేశారు. నాగ్‌పూర్‌లో మార్చ్ 7 వరకూ స్కూళ్లు, కళాశాలలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం దేశంలో గత 24 గంటల్లో 16 వేల 752 కొత్త కేసులు నమోదు కాగా 113 మంది మరణించారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మహారాష్ట్రతో పాటు పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, బెంగాల్, జమ్ముకశ్మీర్‌లలో వ్యాక్సినేషన్ డ్రైవ్ విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. అటు ప్రదాని మన్ కీ బాత్ ( Mann ki baat )కార్యక్రమంలో కూడా ప్రజలు ఇదివరకూ పాటించినట్టేత ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించాలని కోరారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వైరస్ బలంగా ఉందని..ప్రజల సహకారం ఉంటే వ్యాధిని పూర్తిగా అదుపు చేయగలమన్నారు. 

Also read: Kisan samman nidhi: కిసాన్ సమ్మాన్ నిధి 8వ విడతలో..మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News