Telangana: రాజధాని నగరంలో అక్రమ కట్టడాలు, హైకోర్టు సీరియస్

Telangana: తెలంగాణ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది చోద్యం చూస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు అభిప్రాయమిది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2021, 07:21 PM IST
  • తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
  • అక్రమ నిర్మాణాలు, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాల్సిదిగా జీహెచ్ఎంసీకు ఆదేశం
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామక అంశంపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు
Telangana: రాజధాని నగరంలో అక్రమ కట్టడాలు, హైకోర్టు సీరియస్

Telangana: తెలంగాణ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది చోద్యం చూస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు అభిప్రాయమిది.

హైదరాబాద్ జంట నగరాల్లో అక్రమ నిర్మాణాల( Illegal Constructions)పై హైకోర్టు (High court) సారించింది. భాగ్యనగరంలో యధేచ్ఛగా సాగుతోన్న అక్రమ కట్టడాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని నగరంలో ఎక్కడపడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. అక్రమ కట్టడాలపై తరచూ దాఖలవుతున్న పిటీషన్ల నేపధ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇకపై ఈ అంశంపై పిటీషన్లు దాఖలు కాకూడదని అధికారుల్ని హెచ్చరించింది. జంట నగరాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల అంశంపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ(GHMC)ను కోరింది. ఈ నివేదికలో 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాల్ని గుర్తించారు, ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది వివరించాలని సూచించింది.  కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకు వాయిదా వేసింది. 

మరోవైపు తెలంగాణ హైకోర్టు( Telangana high court)లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (Public prosecutors) కొరత వల్లే కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు (High court) అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమని గుర్తు చేసింది. 414 పీపీ పోస్టులకు గానూ..212 పోస్టులు భర్తీ అయ్యాయని..మిగిలిన పోస్టుల భర్తీ విషయమై చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. దాంతో సీరియస్ అయిన హైకోర్టు ఫలితాలు కావాలని స్పష్టం చేసింది. ప్రాసిక్యూషన్ కు సంబంధించి పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని(Telangana government) ఆదేశించింది. రెండువారాల్లోగా ఈ అంశంపై కూడా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ..విచారణను ఏప్రిల్ 14వ తేదీకు వాయిదా వేసింది.

Also read: Kishan Reddy Receives COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రజలకు సందేశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News