Gold Mountain Viral Video: Congoలో బంగారు పర్వతం వద్దకు పార, సంచులతో జనాలు పరుగులు, వీడియో వైరల్

Gold Mountain In Congo | బంగారు కొండను పారతో తవ్వుతూ, సంచులలో నింపుకుంటున్న 28 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 8, 2021, 06:32 PM IST
  • ఇంటి చుట్టుపక్కల బంగారం నిక్షేపాలు ఉన్నాయిన తెలిస్తే మీరు ఏమి చేస్తారు
  • సరిగ్గా అలాంటి ఘటన ఆఫ్రికాలోని కాంగో దేశంలో చోటుచేసుకుంది
  • పార, పెద్ద పెద్ద సంచులు తీసుకుని బంగారు పర్వతం వద్ద గుమిగూడిన ప్రజలు
Gold Mountain Viral Video: Congoలో బంగారు పర్వతం వద్దకు పార, సంచులతో జనాలు పరుగులు, వీడియో వైరల్

Gold Mountain Congo Viral Video:  మీ ఇంటి చుట్టుపక్కల బంగారం నిక్షేపాలు ఉన్నాయిన తెలిస్తే మీరు ఏమి చేస్తారు? పని పక్కనపెట్టి మరీ బంగారం కోసం పరుగులు పెట్టడం సాధారంగా కనిపిస్తూనే ఉంటాయి. సరిగ్గా అలాంటి ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. బంగారు పర్వతం గురించి తెలియగానే చుట్టుపక్కల ప్రజలు వేలాదిగా అక్కడ గుమిగూడారు. బంగారం కోసం సంచులు తీసుకుని కొండ దగ్గర తవ్వకాలు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మధ్య ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ కాంగో(Republic Of Congo)లో బంగారంతో కూడిన కొండ(పర్వతం) కనుగొన్నారు. అందులో 60 నుండి 90 శాతం వరకు బంగారం ఆ పర్వతం(Gold Mountain)లో ఉన్నట్లు చెబుతారు. ఈ బంగారు పర్వతం గురించి తెలుసుకున్న వెంటనే, సమీప ప్రాంతాల్లోని ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని తవ్వకాలు చేపట్టారు. పారతో తవ్వుతూ, సంచులలో నింపుకుంటున్న 28 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు పలువురు సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతోంది.

Also Read: JEE Main 2021 Feb Answer Key: జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి ఎగ్జామ్ ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేసింది, డైరెక్ట్ లింక్ మీకోసం

బంగారు నిక్షేపాలతో ఉన్న కొండ ప్రాంతంలో తవ్వకం పనులు జరుగుతున్నాయని తెలియగానే స్థానికులు బంగారాన్ని కొల్లగొట్టడానికి అక్కడికి చేరుకున్నారు. ఈ తతంగాన్ని జర్నలిస్ట్ అహ్మద్ అల్గోబరీ(Ahmad Algohbary) వీడియో రూపంలో ట్విట్టర్లో షేర్ చేసుకోగా వీడియో వైరల్(Viral Video) అయింది.

Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్, త్వరలో బ్యాంక్ ఖాతాలో రూ.2000 జమ

మైనింగ్ నిషేధించారు
కాంగోలోని అనేక కొండలు, పర్వత ప్రాంతాల్లో బంగారం భారీగా దొరుకుతుందట. దాంతో బంగారు త్రవ్వకం(Gold Mining) తరచుగా జరుగుతుంటుంది. అందువల్ల అక్కడ కొంతకాలం ప్రభుత్వం మైనింగ్ సైతం నిలిపివేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News