Telangana Minister KTR: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు, ఒరిగిందేమీ లేదంటూ వ్యాఖ్యలు

Telangana Minister KTR | కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవరికీ తెలియదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో టీఎస్ ఐపాస్ విధానంలో పరిశ్రమలపై అడిగిన ప్రశ్నలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 23, 2021, 03:22 PM IST
Telangana Minister KTR: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు, ఒరిగిందేమీ లేదంటూ వ్యాఖ్యలు

Telangana Minister KTR: ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలే మరోసారి రిపీట్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక పరిశ్రమల రాయితీలు ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ గత ఆరున్నరేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఒక్క పైసా కూడా రాలేదని విమర్శించారు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవరికీ తెలియదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ విధానంలో పరిశ్రమలపై అడిగిన ప్రశ్నలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. గత ఆరున్నరేళ్ల పాలనలో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.2.13లక్షల కోట్ల పెట్టుబడులు ఆర్షించామని తెలిపారు. అయితే కేంద్రం నుంచి ఒక్కపైసా కూడా రాలేదని, పార్లమెంట్ సాక్షిగా రూపొందించిన చట్టాన్నే కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని కేటీఆర్(Telangana Minister KTR) మండిపడ్డారు.

Also Read: WhatsApp: మొబైల్ మరియు Internet లేకున్నా ఎంచక్కా వాట్సాప్ సేవలు, త్వరలో కొత్త ఫీచర్

ఆత్మనిర్భర్ ప్యాకేజీతో తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. తమకు దీనివల్ల ఒరిగిందేమీ లేదని వ్యాపారులే స్వయంగా చెబుతున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో తెలంగాణ‌, ఏపీ రాష్ర్టాల్లో పారిశ్రామీకీక‌ర‌ణ‌కు స‌హాయం చేయాల‌ని, రాయితీలు ఇస్తామ‌ని పేర్కొన్నప్పటికీ తెలంగాణకు ఎలాంటి సాయం అంద‌లేద‌న్నారు.

కేవలం వీధి వ్యాపారులకు రూ.10 వేల రుణ సాయం పొందడానికి మాత్రమే ఉపయోగపడిందన్నారు. మన రాష్ట్రంలో సాగు అవుతున్న పంటలకు అనుగుణంగా టీఆర్ఎస్ సర్కారు ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాట్లు చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదివరకే కొన్ని జిల్లాల్లో ఏర్పాట్లు కాగా, సీఎం కేసీఆర్ మర్గనిర్దేశంతో మరికొన్ని జిల్లాల్లో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాకున్నా తెలంగాణ(Telangana) ప్రభుత్వమే సొంతంగా పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు ఆకర్షించడంలో అభివృద్ధి సాధించిందన్నారు.

Also Read: Telangana COVID-19 Cases: తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదు, GHMCలో విజృంభిస్తోన్న కోవిడ్ మహమ్మారి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News