Chhattisgarh Encounter: అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించిన వైఎస్ జగన్

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ మేజర్ ఎన్‌కౌంటర్  ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్  జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 5, 2021, 03:55 PM IST
Chhattisgarh Encounter: అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించిన వైఎస్ జగన్

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ మేజర్ ఎన్‌కౌంటర్  ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్  జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించారు.

చత్తీస్‌గఢ్‌ (Chhattisgarh Encounter) రాష్ట్రం బీజాపూర్‌లో మవోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు జవాన్లపై ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో గల్లంతైన ఏడుగురు జవాన్ల కోసం రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బీజాపూర్‌ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హిడ్మాపై తెలంగాణ, చత్తీసగఢ్‌, ఒడిశా ప్రభుత్వాలు 50 లక్షల రివార్డు ప్రకటించాయి. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (Ap cm ys jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో అమరులైన ఏపీకి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

ఈ ఘటనలో విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ అమరులయ్యారు. ఈ ఇద్దరి కుటుంబాలకు చెరో 30 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit shah) జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం రాయ్‌‌పూర్‌లో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. 

Also read: Karnataka: యడియూరప్పకు ఊరట కల్పించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలపై స్టే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News