Aarogyasri: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు వెంటాడుతున్న మరో కొత్త సమస్య బ్లాక్ ఫంగస్. రానురానూ బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకంగా మారుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత ఆదేశాలు జారీ చేశారు.
కరోనా సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్(Corona Virus)మహమ్మారితో పాటు మరో కొత్త సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్నరోగులకు బ్లాక్ ఫంగస్ రూపంలో సమస్య వెన్నాడుతోంది. కోవిడ్ నుంచి కోలుకునే ఆనందం ఎంతో సేపు నిలవడం లేదు. బ్లాక్ ఫంగస్ బారిన పడి చూపు కోల్పోవడమో లేదా కొందరైతే ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా కోవిడ్ బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారిలో బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కన్పిస్తోంది. డయాబెటిస్ రోగులకు లేదా కోవిడ్ చికిత్స ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడినవారికి ఈ సమస్య ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు అధికమవుతున్నాయి.
ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన జగన్..బ్లాక్ ఫంగస్(Black Fungus)చికిత్సను సైతం ఆరోగ్య శ్రీలో చేర్చాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరాలు అందించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను తక్షణం ఆరోగ్యశ్రీ(Aarogyasri)లో చేర్చుతున్నామన్నారు. మరోవైపు కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని..ఆ పిల్లలకు ఆర్ధిక సహాయం అందించేలా కార్యాచరణ రూపొందించాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు..గ్రామీణ ప్రాంతాల్లో పగడ్బందీగా ఫీవర్ సర్వే చేస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
Also read: AP Corona Update: రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook