టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలు ధోనీ సారథ్యంలో భారత్ సాధించింది. బ్యాటింగ్ విషయంలోనూ ఎంఎస్ ధోనీని అంత తక్కువగా అంచనా వేయలేం. ప్రపంచంలోని బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ల జాబితాలోనూ ధోనీకి ప్రత్యేక స్థానం.
ఇటీవల కరోనా కేసుల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లీగ్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 7 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. 8 మ్యాచ్‌లలో 6 విజయాలలో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. ఏడు మ్యాచ్‌లలో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) కేవలం 37 పరుగులు మాత్రమే చేసి తన అభిమానులను నిరాశపరిచాడు. సీజన్ సెకండాఫ్‌లో ధోనీ అత్యుత్తమ ఆటతీరును చూస్తామని సీఎస్కే పేసర్ దీపక్ చాహర్ స్పోర్ట్స్‌కీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించాడు. 15 నుంచి 20 ఓవర్లలో బ్యాటింగ్ అనేది ఒకేతీరుగా ఉండదని, ధోనీ రెగ్యూలర్ క్రికెట్ ఆడని కారణంగా త్వరగా ప్రదర్శన చేయలేకపోయాడని దీపక్ చాహర్ అభిప్రాయపడ్డాడు.
Also Read: IPL 2021: ఐపీఎల్ ప్రేమికులకు శుభవార్త, సెప్టెంబర్‌లో మిగతా మ్యాచ్‌ల నిర్వహణ
ఎంఎస్ ధోనీ అధికంగా ఫినిషర్ రోల్ పోషించాడని, రెగ్యూలర్ క్రికెట్లో కొనసాగుతున్న వారికే ఇది చాలా కస్టమని.. అటువంటిది ఎంఎస్ ధోనీ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నాడు. 2018, 2019 ఐపీఎల్ సీజన్లలోనూ ధోనీ భాయ్ కాస్త ఆలస్యంగా పికప్ అయ్యాడని, ఆ తరువాత అత్యుత్తమ ప్రదర్శన చేశాడని గుర్తుచేశాడు. ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ సెకండాఫ్‌లో ఎంఎస్ ధోనీ అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుందన్నాడు. బ్యాటింగ్‌తో పాటు అత్యుత్తమ కెప్టెన్ అని ధోనీ నిరూపించుకున్నాడని, బౌలర్లకు ఏ సమయంలో బంతిని అందించాలో తెలుసునని చెప్పుకొచ్చాడు.
Also Read: ICC WTC Final: టీమిండియా ఓపెనర్ Rohit Sharmaకు మాజీ కోచ్ వార్నింగ్
దీపక్ చాహర్ విషయానికొస్తే ఐపీఎల్ 2021లో 8.04 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. వరుసగా నాలుగో ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా మరింత రాటుదేలుతున్నాడు. ఎంఎస్ ధోనీ తనపై నమ్మకం ఉంచాడని, స్ట్రైక్ బౌలర్‌గా బంతిని అందించడం అందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook