AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది వరుసగా రెండవ రోజు కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పించింది. అదే సమయంలో డిశ్చార్జ్ రేటు పెరగడం ఊరటనిస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణకై వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న కర్ఫ్యూ, లాక్డౌన్(Lockdown) సత్ఫలితాలనిస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రోజుకు 18 గంటల కర్ఫ్యూ(Curfew) ప్రయోజనం చేకూరుస్తోంది. వరుసగా రెండవరోజు కూడా కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గత 24 గంటల్లో ఏపీలో 84 వేల 224 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..16 వేల 167 మందికి పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో 21 వేల 385 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 14 లక్షల 46 వేలమంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1 కోటి 89 లక్షల 24 వేల 545 మందికి కరోనా పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1 లక్షా 86 వేల 782 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా చిత్తూరులో జిల్లాలో అత్యధికంగా 14, పశ్చిమ గోదావరి జిల్లాలో 13, గుంటూరు, విజయనగరం జిల్లాలో 8 మంది, అనంతపురం, నెల్లూరులో 9మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 10 వేల 531 మంది కరోనా బారినపడి మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2 వేల 967 , తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 325, విశాఖపట్నంలో 1434 కేసులు నమోదయ్యాయి. అటు అనంతపురంలో 1472 కేసులు వెలుగు చూశాయి.
Also read: Oxygen Plants: ఏపీలో కొత్త ఆక్సిజన్ పాలసీ, ప్రైవేట్ సెక్టార్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook