Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకాయి. ఫలితంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఉండనుంది.
వేసవి నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం లభించినట్టే. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) రాష్ట్రాన్ని తాకడంతో పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రేపటికి పూర్తి స్థాయిలో రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రేపట్నించి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడు..తూర్పు ఈశాన్య బంగాళాఖాతం, మయన్మార్ పరిసర ప్రాంతంలో సముద్రమట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతం(Bay of Bengal), పరిసర ప్రాంతాల్లో ఈ నెల 11 వతేదీన అల్పపీడనంగా బలపడనుంది. అనంతరం ఒడిశా తీరం వైపు కదులుతూ వాయుగుండంగా మారనుంది. అయితే తుపాను రూపం దాల్చుతుందా లేదా అనేది ప్రస్తుతానికి అంచనా వేయలేదు. వాయుగుండం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ నెల 11 నుంచి 14 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains Alert) కురిసే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది.
అటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 2 వందల నుంచి 250 మిల్లీలీటర్ల వర్షం నమోదయ్యే అవకాశాలున్నాయంటోంది. అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకోనున్నాయి. అల్పపీడన ప్రభావంతో కోస్తా తీరమంతా అల్లకల్లోలంగా ఉండనుంది. తీరం వెంబడి 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ నెల 15 వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.
Also read: AP CM YS Jagan's Delhi tour: ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook