Corona Variants Attack: కరోనా మహమ్మారి ఏ రూపంలో ఎలా దాడి చేస్తుందనేది తెలియని పరిస్థితి. కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ వివిధ వేరియంట్లతో దాడి చేస్తోంది. బెల్జియంలో వెలుగు చూసిన ఆ ఘటన మాత్రం మరింత ఆందోళన కల్గిస్తోంది.
కరోనా మహమ్మారి దాడి చేసే పద్ధతి మారుతోంది. నిన్న మొన్నటి వరకూ వైరస్ మ్యూటేట్ చెందుతూ వివిధ రకాల వేరియంట్లతో దాడి చేయడం చూశాం. ఆల్ఫా వేరియంట్, బీటా వేరియంట్, డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ (Delta plus Variant) ఇలా రూపం మార్చుకుని దాడి చేస్తోంది. కానీ బెల్జియంలో వెలుగు చూసిన ఆ ఘటన మాత్రం ఒక్కసారిగా భయపెడుతోంది. మరింత ఆందోళన కల్గిస్తోంది. బ్రుసెల్స్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు మార్చ్ నెలలో కరోనా వైరస్ బారిన పడింది. అలాస్ట్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గానే ఉన్నా..ఆరోగ్యం మాత్రం క్షీణిస్తూ వచ్చింది. ఐదు రోజుల తరువాత మరణించింది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నా ఆరోగ్యం క్షీణించి మరణించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా నిర్ఘాంతపోయే నిజం వెలుగు చూసింది.
ఆమె శరీరంలో బ్రిటన్ ఆల్ఫా వేరియంట్(Alpha variant), దక్షిణాఫ్రికా బీటా వేరియంట్(Beta variant)రెండూ ఉన్నాయని గుర్తించారు.ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఎందుకంటే రోగి శరీరంలో రెండు వేరియంట్లు గుర్తించడం ఇదే తొలిసారి. ఇలాంటి కేసులు ఎప్పుడూ ఎదురు కాలేదు. మార్చ్ నెలలో ఈ రెండు వేరియంట్ల కేసులు బెల్జియంలో వెలుగు చూశాయని..ఇద్దరు వేర్వేరు వ్యక్తుల్నించి రెండు వేరియంట్లు ఆమెపై దాడి చేసుంటాయని మాలిక్యులర్ బయాలజిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బెల్జియంలో(Belgium) కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్(Coronavirus) కారణంగా 25 వేలమంది మృత్యువాత పడ్డారు. కరోనా రెండు వేరియంట్లు ఒకే వ్యక్తిలో బయటపడటం దేశంలో ఆందోళనను పెంచుతోంది.
Also read: Solar Storm: అతి భయంకర వేగంతో సౌర తుపాను, ఇవాళ లేదా రేపు భూమిపై ఎటాక్, తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook