AP Government: ఏపీ ప్రభుత్వం కొత్త పరిశ్రమల స్థాపన దిశగా ముందుకెళ్తోంది. పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ప్రముఖ ఫ్లైవుడ్ తయారీ సంస్థ సెంచురీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది.
పారిశ్రామిక ప్రగతి, కొత్త పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలనిస్తున్నాయి. ప్రముఖ ఫ్లైవుడ్(Century plywoods) తయారీ సంస్థ సెంచురీ ఫ్లై వుడ్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. కడప జిల్లా బద్వేలులో వేయికోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ స్థాపించనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)ను..సెంచురీ ఫ్లైవుడ్స్ ప్రతినిధులు కలిసి..పెట్టుబడి ప్రణాళికల్ని వివరించారు.ఫ్లైవుడ్, బ్లాక్‌బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్, పార్టికల్ బోర్డ్‌ల తయారీలో దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందిన సెంచురీ ఫ్లై బద్వేలులో మూడు దశల్లో యూనిట్ స్థాపించనుంది. తొలిదశ పనుల్ని తక్షణం ప్రారంభించి..2022 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 నాటికి 3 దశలు పూర్తి చేయాలనేది కంపెనీ ఆలోచన. తొలిదశలో 4 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో యూనిట్ పూర్తి చేసి 2024 నాటికి 10 లక్షల టన్నుల సామర్ధ్యానికి పెంచనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3 వేలమందికి, పరోక్షంగా 6 వేలమందికి ఉపాధి లభించనుంది.
Also read: Gangavaram port: గంగవరం పోర్టు.. ఇక 'అదానీ' సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP Government: ఏపీలో వేయి కోట్లతో కొత్త పరిశ్రమ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చలు