Harvest Moon: ఆకాశంలో ఈ అద్భుతాన్ని చూసారా..? ఇంకా 3 రోజులే ఈ అవకాశం..త్వరగా చూడండి!

20 సెప్టెంబర్ సోమవారం రోజున దాదాపు 99.9 శాతం చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించాడు.  21 సెప్టెంబర్ మంగళవారం నుండి మరో దశలోకి చేరటం కారణంగా ఈ అద్భుతం చూసే అవకాశం మరో 3 రోజుల వరకు ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2021, 06:56 PM IST
  • నిన్నటి నుండి నిండుగా ప్రకాశవంతంగా కనిపిస్తున్న చంద్రుడు
  • ఈ చంద్రుడిని 'హార్వెస్ట్ మూన్' అని పిలుస్తారు.
  • సెప్టెంబర్ మరియు అక్టోబరు లో ఇలా కనపడుతుంది
Harvest Moon: ఆకాశంలో ఈ అద్భుతాన్ని చూసారా..? ఇంకా 3 రోజులే ఈ అవకాశం..త్వరగా చూడండి!

Harvest Moon: సెప్టెంబర్ 20 సోమవారం రోజున ఆకాశంలో జనాలు ఒక అందమైన అద్భుత దృశ్యాన్ని తిలకించారు. భూమికి ఉత్తర అర్ధభాగంలో (Northern Hemisphere) చంద్రుడు పౌర్ణమి కారణంగా నిండుగా అందంగా కనిపించాడు. సెప్టెంబర్‌లో కనిపించే చంద్రుడు ప్రత్యేకం ఎందుకంటే, ఈ మూడు రోజులు చాలా అందంగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. 

Harvest Moon అంటే ఏమిటి..??
భూమికి ఉత్తర అర్ధగోళంలో (Northern Hemisphere) వేసవి కాలంలో చివరి వచ్చే పౌర్ణమి (Full Moon) ఇది. దీనిని 'హార్వెస్ట్ మూన్' (Harvest Moon) అని పిలుస్తారు. సాధారణంగా ఇది సెప్టెంబర్‌ నెలలో కనపడుతుంది కానీ కొన్ని సార్లు  అక్టోబర్‌లో కూడా కనిపిస్తుంది.

Also Read: Shocking Facts about Rajkundra: రాజ్‌కుంద్రా ఫోన్‌లో 119 నీలి చిత్రాలు.. 9 కోట్లకు అమ్మకం

కోతల సమయం
ఈ సమయంలో యూరప్ (Europe) మరియు అమెరికాలో (Amercia) పంటల కోత జరుగుతుంది. అందుకే దీనికి హార్వెస్ట్ మూన్ (Harvest Moon) అని పేరు పిలుస్తారు. 'హార్వెస్ట్ మూన్' సమయంలో, చంద్రుడు సూర్యాస్తమయం సమయలో కాసేపు కనపడతాడు మరియు పూర్తీ రాత్రి నిండుగా ప్రకాశవంతంగా కనపడుతుంది.  

శరదృతువు విషువత్తు ప్రారంభం
20 సెప్టెంబర్ సోమవారం రోజున దాదాపు 99.9 శాతం చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించాడు.  21 సెప్టెంబర్ మంగళవారం నుండి మరో దశలోకి చేరటం కారణంగా ఈ అద్భుతం చూసే అవకాశం మరో 3 రోజుల వరకు ఉంది. శరదృతువు విషువత్తు (Autumn Equinox) సెప్టెంబర్ 22 న ప్రారంభమవుతుంది.

Also Read: Taapsee: తాప్సీ శరీరంపై నెటిజన్ సెటైరిక‌ల్ కామెంట్...అదిరిపోయే రిప్లై ఇచ్చిన సొట్ట‌బుగ్గల సుంద‌రి

గత వారం బృహస్పతి (Jupiter) మరియు శని (Saturn), చంద్రుడితో (Moon) త్రిభుజంలో (Triangle) కనిపించాయి,  అవి ఇప్పుడు దూరమవుతున్నాయి. అంతకు ముందు డిసెంబర్ 21 న, భూమి నుండి ఇది గత 400 సంవత్సరాలుగా కనపడని  దృశ్యం కనిపించింది. భూమి నుండి చూసినప్పుడు బృహస్పతి (Jupiter) మరియు శని (Saturn) చాలా దగ్గరగా కనిపించాయి. రెండు గ్రహాల కారణంగా, "మహా సంయోగం"  (Great Conjunction) అని పిలువబడే ఈ అరుదైన సంఘటనను ప్రపంచవ్యాప్తంగా తిలకించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News