Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్‌ ప్రీత్ సింగ్‌..త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న రకుల్‌

Rakul Preet singh boyfriend: తన రిలేషనషిప్, పెళ్లి గురించి క్లియర్‌‌గా చెప్పేసింది రకుల్. తాను రిలేషన్‌పిష్‌లో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 03:42 PM IST
  • రిలేషనషిప్, పెళ్లి గురించి చెప్పేసిన రకుల్
  • బర్త్ డే రోజే బాయ్‌ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన బ్యూటీ
  • బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్టు సోషల్‌మీడియాలో పోస్ట్
Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్‌ ప్రీత్ సింగ్‌..త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న రకుల్‌

Rakul Preet singh shares photo with boyfriend jackky bhagnani on her birthday: టాలీవుడ్ (tollywood) ప్రేక్షకుల మదిని దోచిన నటి రకుల్ ప్రీత్ సింగ్. నేడు ఆమె పుట్టిన రోజు. బర్త్ డే రోజే ఈ బ్యూటీ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. తన రిలేషనషిప్, పెళ్లి గురించి క్లియర్‌‌గా చెప్పేసింది రకుల్. తాను రిలేషన్‌పిష్‌లో (relationship) ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని (jackky bhagnani) ప్రేమిస్తున్నట్టు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. జాకీ భగ్నానీతో కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. ఆ ఫోటోలో జాకీ బగ్నాని చేతిని పట్టుకుని నడుస్తోంది రకుల్‌.

Also Read : MAA Election Polling: మా ఎన్నికల్లో భారీగా పోలింగ్, నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

థ్యాంక్‌ యు మై లవ్‌.. ఈ సంవత్సరం నేను అందుకున్న అతిపెద్ద బహుమతి నువ్వే. నా లైఫ్‌లో రంగులు నింపినందుకు.. నన్ను నువ్వు ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటావు... థ్యాంక్యూ అంటూ జాకీని (jackky) ఉద్దేశించి రకుల్‌ (Rakul) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. అంతేకాదు నన్ను ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటావు. ఇలా ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో మధర జ్ఞాపకాలను తయారు చేసుకుందాం అంటూ హార్ట్‌ ఎమోజీలతో తన పోస్ట్‌ను నింపేసింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

 

Also Read : Pragya Jaiswal: బాలయ్య హీరోయిన్ కు కొవిడ్..షాక్ లో అఖండ చిత్రయూనిట్

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet singh) త్వరలోనే జాకీ భగ్నానీని పెళ్లాడనుంది. కొంతకాలంగా జాకీ బగ్నానితో రకుల్‌ సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తోంది. రకుల్‌ అతడితోనే ఏడడుగులు వేయబోతున్నారు. కాగా ఈ రోజే రకుల్‌ బర్త్‌డే (rakul preet singh birthday). నేటితో ఆమె 31వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె ప్రపంచానికి తన ప్రేమను పరిచయం చేయడం విశేషం. జాకీ కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ.. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను... ఎంత రుచికరమైన భోజనం అయినా నువ్వు లేకుండా తింటే వ్యర్థమే.. హ్యాపీ బర్త్ డే రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet singh) అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

 

Also Read :MAA Elections : "మా" గొడవలకు తెర వెనుక ఉండి నడిపించే వారే కారణం - రోజా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News