Akash Puri speech at Romantic movie pre-release event: శుక్రవారం రాత్రి వరంగల్‌లో జరిగిన 'రొమాంటిక్' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ ఎంతో ఉద్వేగంతో మాట్లాడాడు. తన తాత సింహాచలం నాయుడు పేరు ఎవరికీ తెలియదని, కానీ తన తండ్రి పూరి జగన్నాథ్ పేరు అందరికీ తెలుసని చెబుతూ.. బ్యాగ్రౌండ్ లేనోడు ఫెయిలైతే సింపతీ చూపిస్తారు. బ్యాగ్రౌండ్ ఉన్నోడు ఫెయిలైతే కనీసం మనిషిగా కూడా చూడరని అన్నాడు. ఒకప్పుడు తన తండ్రి పూరి జగన్నాథ్ తీసిన సినిమాలు (Puri Jagannath movies) ఆడకపోతే ఇక వీడి పని అయిపోయిందిరా అని అన్న వాళ్లు ఉన్నారు. అలాగే మూడేళ్ల క్రితం హీరోగా చేసిన నన్ను కూడా వీడు దేనికిపనికిరాడు అని కామెంట్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. నన్ను, మా నాన్నను కామెంట్ చేసిన వాళ్లకు నేను సమాధానం చెబుతానని పూరి ఆకాశ్ అభిప్రాయపడ్డాడు.
తెలుగు సినీ పరిశ్రమే నా స్కూలు ఫీజు కట్టింది. తెలుగు సినీ పరిశ్రమే నాకు అన్నం పెట్టింది. మా నాన్న తెలుగు సినీ పరిశ్రమకు ఎంత చేశాడో అంత కంటే 1 శాతం ఎక్కువే చేసి చస్తాను. సినిమాలు ఫెయిలైనా, సక్సెస్ అయినా, జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తాను. సినిమాలు చేయడం తప్ప నాకు మరొకటి తెలియదు. పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కొడుకుగా పుట్టడం నా అదృష్టం. ఏదో ఓ రోజు నన్ను చూసి మా నాన్న గర్వపడేలా చేస్తాను. జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉండాలని మా నాన్న చెప్పాడు. నాన్నను చూసి ఇప్పుడు నేను కాలర్ ఎగరేస్తున్నాను. భవిష్యత్తులో మా నాన్న కాలరెగరేసేలా చేయాలనేదే నా లక్ష్యం అంటూ నాన్న గురించి ఆకాశ్ పూరి నాన్‌స్టాప్‌గా మాట్లాడాడు.
ప్రతీ సినిమాను మొదటి సినిమాలాగే భావించి కష్టపడి పనిచేయాల్సిందిగా నాన్న సూచించాడు. కానీ నేను మాత్రం నా ప్రతీ సినిమాను ఇదే నా చివరి సినిమా అనుకుని, ప్రతీ షాట్ కోసం కష్టపడి పనిచేస్తానని పూకి ఆకాశ్ తన తండ్రి పూరి జగన్నాథ్‌కి ఇదే వేదికపై నుంచి మాట ఇచ్చాడు. నేను సక్సెస్ అవడానికి రెండేళ్లు పట్టినా.. పదిహేనేళ్లు పట్టినా.. సక్సెస్ కోసం నా పోరాటం మాత్రం ఆపనని పూరి ఆకాశ్ (Akash Puri) స్పష్టంచేశాడు.
Also read : Akash Puri’s Romantic: 'రొమాంటిక్' ట్రైలర్...మామూలుగా లేదుగా..!
రొమాంటిక్ మూవీ ప్రిరీలీజ్ ఫంక్షన్‌కి హాజరైన విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda at Romantic movie pre-release event), వరంగల్ వాసులకు థాంక్స్ చెప్పడంతో మొదలైన ఆకాశ్ పూరి ప్రసంగం.. ఆఖరి వరకు తడబాటు లేకుండా కొనసాగింది. సినిమాల్లో నటులు అలవోకగానే నటించినప్పటికీ.. సినిమా ఫంక్షన్లలో వేదికపై మాట్లాడటానికి మాత్రం వారికి స్టేజ్ ఫీయర్ అడ్డొస్తుంటుంది. కానీ పూరి ఆకాశ్ విషయంలో అలా జరగలేదు. బాల నటుడిగా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ.. సినిమాల మధ్యే పెరిగిన పూరి ఆకాశ్.. హీరోగా స్టేజీపై మాట్లాడడానికి ఏ మాత్రం తడుముకోలేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పడానికి ఏ మాత్రం జంకలేదు. మొత్తానికి తండ్రికి తగ్గ తనయుడు అని ఆకాశ్ పూరి ప్రసంగం (Romantic movie pre-release event news) వింటే అనిపించేలా ఆకాశ్ తన మాటలతో ఆకట్టుకున్నాడు.
Also read : Varudu Kavalenu trailer: ఆకట్టుకుంటున్న వరుడు కావలెను ట్రైలర్
Also read : Jai Bhim Movie Trailer: సూర్య 'జై భీమ్' ట్రైలర్ వచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook