Commercial LPG Price Today: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు (LPG Gas price) దేశవ్యాప్తంగా భారీగా పెరిగాయి. వాణిజ్యపరంగా వినియోగించే ఎల్పీజీపై రూ.266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. నవంబర్ 1 నుంచే సవరించిన ధరలు అమలులోకి రానున్నాయి. ఈ పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర (LPG Cylinder price in Delhi) రూ.2000.50కు చేరుకుంది. ఇదివరకు ఈ ధర రూ.1734గా ఉంది. అయితే, గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధర యథాతథంగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి. ఎల్పీజీ ధరలను (LPG Gas Cylinder Price) క్రమంగా పెంచుతూ వాటిపై సబ్సిడీని గత ఏడాది తొలగించింది ప్రభుత్వం.
ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
Also Read: Petrol Price Hike Today: మళ్లీ పెట్రో వాత.. వరుసగా ఆరో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి