Gold Smuggling News: ఇప్పటి వరకు విమానాశ్రయాల్లోనే ఎక్కువగా అక్రమ బంగారం పట్టుబడుతోంది. కానీ, తాజాగా స్మగ్లర్లు రైళ్లలో కూడా బంగారం తరలిస్తున్నారు. రైల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రివెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో యశ్వంత్‌పుర్- హౌరా ఎక్స్‌ప్రెస్ (Yeshwantpur- Howrah Express)లో బంగారాన్ని తరలిస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు.. విశాఖ రైల్వే స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం అధికారులు మాటువేశారు.
రైలు రాగానే అందులోకి ప్రవేశించి.. నిందితుడిని తనిఖీ చేశారు. అతని వద్ద ఏకంగా.. రూ.1.91 కోట్లు విలువ చేసే 3.89 కిలోల బంగారం బయటపడింది. నిందితుడు కోల్‌కతా నుంచి ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టుబడిన బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి తీసుకువచ్చి.. కోల్‌కతాలో వివిధ రకాల ఆభరణాలుగా తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని అధికారులు చెప్పారు. నిందితుడిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్లు డిఆర్ఐ (DRI) అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే... యశ్వంత్‌పూర్- హవ్డా సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్టు డీఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అందించింది. దీంతో డీఆర్ఐ అధికారులు విశాఖ రైల్వే స్టేషన్లో రైలును ఆపి తనిఖీ చేయగా కోల్‌కతా నుంచి వస్తున్న ప్రయాణికుడి వద్ద 3.98 కిలోల బంగారం ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్, కోల్‌కతా మీదుగా అక్రమబంగారం తరలిస్తున్నట్టు డీఆర్ఐ అధికారులు గర్తించారు. బంగ్లాదేశ్, కోల్‌కతా మీదుగా అక్రమ బంగారం తీసుకొస్తున్నట్టు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కోల్‌కతాకు చెందిన వ్యక్తిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read: AP High Court: న్యాయమూర్తుల్ని చులకన చేయడం మీకు కాలక్షేపమా
Also Read: AP Local Elections: మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు షురూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook