Black Fungus after Dengue : డెంగ్యూ నుంచి కోలుకున్న ఓ పేషెంట్ బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 49 ఏళ్ల డెంగ్యూ పేషెంట్‌లో ఈ వ్యాధి బయటపడింది. సాధారణంగా కోవిడ్ (Covid 19) చికిత్సలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు బ్లాక్ ఫంగస్ (Black Fungus) బారినపడటం జరుగుతుంది. గత ఏడాది కాలంగా ఇలాంటి కేసులు దేశంలో వేల సంఖ్యలో నమోదయ్యాయి. కానీ డెంగ్యూ నుంచి కోలుకున్న పేషెంట్‌లో బ్లాక్ ఫంగస్ వ్యాధి బయటపడటం అరుదైన కేసుగా పరిగణిస్తున్నారు.
అపోలో ఆసుపత్రి వర్గాలు దీనిపై ఒక ప్రకటన విడుదల చేశాయి. డెంగ్యూ నుంచి కోలుకున్న 15 రోజులకు 49 ఏళ్ల ఓ పేషెంట్ తన కంటి చూపు (Mucormycosis) కోల్పోయాడని అందులో పేర్కొన్నారు. అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఈఎన్‌టీ కన్సల్టెంట్ డా.సురేశ్ సింగ్ మాట్లాడుతూ...'ఓ అరుదైన బ్లాక్ ఫంగస్ కేసు మా దృష్టికి వచ్చింది. డెంగ్యూ జ్వరం నుంచి కోలుకున్న తర్వాత అకస్మాత్తుగా అతను కంటి చూపు కోల్పోయాడు. ఇలా జరగడం అత్యంత అరుదు. సాధారణంగా డయాబెటీస్ ఉన్నవారికి లేదా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఇతర ఇన్ఫెక్షన్లు ఏమైనా వచ్చినప్పుడు బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. కానీ డెంగ్యూ కేసులో ఇది అరుదు.' అని పేర్కొన్నారు.
డా.అతుల్ అహుజ అనే మరో సీనియర్ ఈఎన్‌టీ కన్సల్టెంట్ మాట్లాడుతూ... డెంగ్యూ నుంచి కోలుకున్నవారిలో ముక్కు లేదా కంటి భాగంలో బ్లాక్ ఫంగస్ (Black Fungus) లక్షణాలు ఉన్నాయా లేదా అనేది గుర్తించడం ముఖ్యం. కొన్నిసార్లు బెస్ట్ ట్రీట్‌మెంట్ అందించినా సరే పేషెంట్ శాశ్వతంగా కంటిచూపును కోల్పోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు,ఇన్ఫెక్షన్ ఇతర అవయవాలకు పాకకుండా కళ్లు తొలగించాల్సి ఉంటుంది.' అని పేర్కొన్నారు.
Also Read: Delhi Pollution: ఢిల్లీలో చేయుదాటుతున్న పరిస్థితులు.. లాక్‌డౌన్ దిశగా సీఎం ఆలోచన
సాధారణంగా డెంగ్యూ (Dengue Fever) సోకిన రోగికి బ్లడ్ ప్లేట్ లెట్స్ పడిపోతాయి. జ్వరం, వికారం, దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగికి సకాలంలో చికిత్స అందించగలిగితే ప్రాణాలకు ప్రమాదమేమీ ఉండదు. అయితే డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ సోకడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోన్న అంశం. ప్రస్తుతం దేశంలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 2708 డెంగ్యూ కేసులు (Dengue cases) నమోదయ్యాయి. 9 మరణాలు సంభవించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
.