Attack on Actress Shalu Chourasia in Hyderabad: హైదరాబాద్ (Hyderabad) లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) ప్రాంతంలో ఉన్న కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద నటి షాలు చౌరాసియా (Shalu Chourasia) పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దాడిలో గాయపడ్డ హీరోయిన్ చౌరాసియాను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు.
పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. ఎప్పటి లాగే ఉదయం వాకింగ్ కోసం కేబీఆర్ పార్క్ వద్దకు వెళ్తున్న హీరోయిన్ షాలు చౌరాసియాపై ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెపై దాడి చేయటమే కాకుండా.. తన చేతిలో ఉన్న ఫోన్ ను లాక్కెళ్లాడు.. దుండగుడిని నిలువరించే క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది.
Also Read: AUS Winning Celebration: 'షూలో బీర్' పోసుకొని తాగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. వీడియో వైరల్
#shaluchourasiya Random #cute Picture👆🔥
Like & follow @IndianDrunken For more #Trending #Viral Updates 🔥 pic.twitter.com/itIU0Klekm— Southindia actress (@IndianDrunken) June 24, 2021
వెంటనే ఆమె 100కు డయల్ చేసి పోలీసులకు తెలుపగా.. అక్కడి చేరుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నటి షాలు చౌరాసియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నటి షాలు చౌరాసియా పాపులర్ కాకున్నప్పటికీ.. ఇప్పటి వరకు మూడు సినిమాలలో హీరోయిన్ గా నటించారు. 'ఎన్ కదలి సీన్ పోదుర' (En Kadhali Scene Podura) అనే తమిళ్ సినిమాలో నటించిన చౌరాసియా... ఓ పిల్లా నీ వల్ల (O Pilla Nee Valla), అరణ్యంలో (Aranyamlo) అనే సినిమాలతో బాగా ఫేమస్ అయింది.
Also Read: Ghani Movie Teaser: మెగా పవర్ స్టార్ వాయిస్ ఓవర్ తో.. వరుణ్ తేజ్ ‘గని’ టీజర్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి