తెలంగాణ: మద్యం దుకాణాల ఏర్పాటుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు..ఒక్క రోజే 15 వేలు..

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ఒక్క రోజే గడువు ఉండటంతో బుధవారం దాదాపు 15 వేల దరఖాస్తులు వచ్చాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 10:15 AM IST
  • తెలంగాణలో మద్యం దుకాణాలు పెంపు
  • నిన్న ఒక్కరోజే 15వేల దరఖాస్తులు
  • మద్యం దుకాణాల దరఖాస్తులకు చివరి తేదీ నేడే
తెలంగాణ: మద్యం దుకాణాల ఏర్పాటుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు..ఒక్క రోజే 15 వేలు..

Telangana news: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు నుంచి నూతన మద్యం పాలసీ(new liquor policy 2021) అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో...రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఏర్పాటు(application for liquor license)కు ఆబ్కారీ శాఖ ఈ నెల 9వ తేదీ నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. మంగళవారం వరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. కానీ ఒక్కరోజే గడువు ఉండటంతో..బుధవారం దాదాపు 15 వేల దరఖాస్తులు వచ్చాయి.

దీంతో దరఖాస్తుల సంఖ్య 30 వేలకు చేరుకుంది. గురువారం మరో 30 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. చివరి రోజు దరఖాస్తుల రద్దీ ఎక్కువైతే..ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం, రద్దీ మరీ అధికమైతే టోకెన్స్(Token) విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌, ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి

ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. దుకాణం వచ్చినా, రాకపోయినా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. దాంతో కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి కనీసం రూ.1200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. చివరి తేదీని పొడిగించే అంశంపైనా అధికారులు దృష్టి సారించారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు జారీ కోసం అందిన దరఖాస్తుల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా(Khammam District)లో 122 మద్యం దుకాణాలకు 3,864 దరఖాస్తులు వచ్చాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News